https://oktelugu.com/

Ajay Devgan : అల్లు అర్జున్ ని చూసి ఆరోజు 5 మంది స్టార్ హీరోలు భయపడి పారిపోయారు అంటూ నటుడు అజయ్ షాకింగ్ కామెంట్స్!

ఆర్గానిక్ రీచ్ గడిచిన రెండు దశాబ్దాలలో ఏ హీరో సినిమాకి కూడా రాలేదు అనొచ్చు. అలాంటి సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2 ' వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. మన తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మేనియా ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలా ఉందో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 08:20 PM IST

    Ajay Devgan

    Follow us on

    Ajay Devgan :  మన టాలీవుడ్ నుండి ప్రభాస్ తర్వాత బాలీవుడ్ లో మంచి మార్కెట్ ని సంపాదించిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే, అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభాస్ బాహుబలి సిరీస్, కల్కి, సలార్ వంటి చిత్రాలతో బాలీవుడ్ ఆడియన్స్ లో సంపాదించిన క్రేజ్, ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని అల్లు అర్జున్ కేవలం పుష్ప అనే ఒక్క సినిమాతో దక్కించుకున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుష్ప క్యారక్టర్ నార్త్ ఇండియన్స్ కి ఆ స్థాయిలో ఎక్కేసింది. ప్రముఖ క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇలా ప్రతీ రంగానికి చెందిన వాళ్ళు ‘తగ్గేదేలే’ మ్యానరిజమ్స్ ని చేస్తూ కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఆ స్థాయి ఆర్గానిక్ రీచ్ గడిచిన రెండు దశాబ్దాలలో ఏ హీరో సినిమాకి కూడా రాలేదు అనొచ్చు. అలాంటి సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2 ‘ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. మన తెలుగు ఆడియన్స్ కంటే హిందీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మేనియా ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలా ఉందో ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

    ఆయన మాట్లాడుతూ ‘ బాలీవుడ్ లో పుష్ప సీక్వెల్ కి ఉన్నటువంటి క్రేజ్ గతం లో నేను బాహుబలి 2 కి మాత్రమే చూసాను. అక్కడి ఆడియన్స్ పుష్ప 2 కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. నేను ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటిస్తున్న సింగం రిటర్న్స్ అనే చిత్రం లో నటిస్తున్నాను. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటుగా అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ వంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. బాలీవుడ్ హిస్టరీ లోనే భారీ ముల్టీస్టార్రర్ చిత్రం గా ఆ సినిమా తెరకెక్కుతుంది. అయితే పుష్ప 2 చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేయాలనీ ముందుగా అనుకున్నారు కదా, సింగం రిటర్న్ ని కూడా అదే రోజున విడుదల చేయాలనీ నిర్మాతలు భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అజయ్ దేవగన్ పుష్ప 2 తో పోటీ పడితే మన సినిమాని ఎవ్వరూ చేయరు, వాయిదా వేయండి అని చెప్పాడు. ఒక తెలుగు హీరో సినిమాని చూసి అంత పెద్ద బాలీవుడ్ సినిమా భయపడి వెనక్కి వెళ్లడం చూసి చాలా గర్వపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చాడు అజయ్. రీసెంట్ గా ఆయన ‘పొట్టెల్’ అనే చిత్రంలో విలన్ గా నటించాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొన్న అజయ్, ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 6న విడుదల అవ్వబోతున్న ‘పుష్ప 2 ‘ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.