OM Movie: తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓం’ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్, టీజర్ వంటివి పెద్ద హిట్ అవ్వడం తో తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చాయి. మమ్ముటీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం లో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారట. ఈ షో కి సంబంధించిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎర్ర చందం మాఫియా ని బ్రేక్ చేయడానికి పోలీసులు హీరో ని మమ్ముటీ గ్యాంగ్ లోకి ఒక స్పై గా చేరుతాడు. అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు చేరుస్తూ ఉంటాడు హీరో. ఈ క్రమం లో పోలీసులు అమాయకులైన కూలీలను ఎన్కౌంటర్ లో కాల్చివేస్తారట. దీంతో అప్పటి వరకు స్పై గా ఉన్న ధనుష్, నిజంగానే మమ్ముటీ గ్యాంగ్ లో ఒక సభ్యుడిగా మారిపోతాడత. ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఈ సినిమా స్క్రీన్ ప్లే ని నడిపించినట్టు టాక్. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అట.
సినిమా ఆరంభం నుండే కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడట. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఆసక్తికరంగా ఉండడం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యిందట. ఇక సాయి అభయాంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని, హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల క్యారెక్టర్స్ చాలా బాగా వచ్చాయని, మమ్ముటి క్యారెక్టర్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ గా నిల్చిందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ ఏడాది సౌత్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని ఆడియన్స్ చూడబోతున్నారు అట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.