https://oktelugu.com/

OKtelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్

OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న కొన్ని ఐడియాలను వెబ్‌సిరీస్ కోసం కథలుగా తీర్చిదిద్దుతున్నాడట. షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించే వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు తర్వాత తెరపై కనిపించడానికి ఆర్యన్ ఆసక్తిగా లేడని వార్తలు వినిపిస్తున్నాయి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 23, 2022 / 12:50 PM IST
    Follow us on

    OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తన వద్ద ఉన్న కొన్ని ఐడియాలను వెబ్‌సిరీస్ కోసం కథలుగా తీర్చిదిద్దుతున్నాడట. షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించే వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు తర్వాత తెరపై కనిపించడానికి ఆర్యన్ ఆసక్తిగా లేడని వార్తలు వినిపిస్తున్నాయి.

    aryan khan

    మరో అప్ డేట్ విషయానికి వస్టే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాల లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఈ నెల 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈ మూవీ టికెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టికెట్లు పెట్టిన నిమిషాల్లోనే ఫ్యాన్స్ కొనేస్తున్నారు. మార్నింగ్ షో టికెట్లు దాదాపు అమ్ముడైపోయాయి. కాగా ఈ నెల 23న హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

    Also Read: కొత్త జిల్లాలపై వివాదాలు ముగిసేనా? ఎన్టీఆర్ పేరు ఉంచుతారా? అభ్యంతరాలివీ?

     

    Bheemla Nayak

    ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా కమల్‌హాసన్ తప్పుకోవడంతో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ హీరో శింబును ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. తాజాగా మానాడు సినిమాతో హిట్ అందుకున్నాడు శింబు. దీన్ని తెలుగులోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    simbu

    అలాగే ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి కుమారుడు సింహా కోడూరి మరో సినిమా చేయనున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సతీశ్ త్రిపుర దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాకు ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సింహా సోదరుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

    Also Read:  మ‌త్స్య‌కారుల ఉపాధిని దెబ్బ‌తీసే జీవో 217 వెన‌క్కి తీసుకోవాల్సిందేనా?

    Recommended Video:

    Tags