Oka Chinna family Story: కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

Oka Chinna family Story:  మహేశ్ ఉప్పల దర్శకత్వంలో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ”. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించనుంది. ఫుల్‌ టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఈ  వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా నవంబర్‌ 19 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇటీవల నేచురల్ స్టార్ నాని […]

Written By: Raghava Rao Gara, Updated On : November 8, 2021 6:49 pm
Follow us on

Oka Chinna family Story:  మహేశ్ ఉప్పల దర్శకత్వంలో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ”. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించనుంది. ఫుల్‌ టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఈ  వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా నవంబర్‌ 19 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇటీవల నేచురల్ స్టార్ నాని విడుదలైన టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కింగ్  నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ మ్నెరకు సోషల్ మీడియా వేదికగా నాగ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  మన అందరికీ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వస్తుంది అని నాగార్జున అన్నారు. అలానే ఈ ట్రైలర్లో నరేష్, సంగీత్ శోభన్ మధ్య డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. అమ్మాయి వంద రూపాయలు అడిగితే… జేబు తడుము కోగా రూపాయి మాత్రమే ఉండటం, అది చూసి హీరోయిన్ వెళ్లడంతో తర్వాత ఏమైందనేది ఆసక్తిగా మారింది.  ఓ మధ్యతరగతి నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీదపడితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. ఈ సిరీస్ లో నటి తులసీ, నరేశ్‌ కీలకపాత్రలు పోషించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందర్నీ ఆకట్టుకునే సిరీస్ ఇదని నిహారిక తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.