Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షో లలో ఒకటి. ఈ షో వల్ల స్టార్ మాకి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. 105 రోజుల్లో, 43 రోజులు మిగిలి ఉన్నాయి. పదో వారానికి విశ్వ ఎలిమినేట్ అయ్యాడని నిన్న (ఆదివారం) జరిగిన ఎపిసోడ్ వల్ల తెలిసిపోయింది.
మనం ముందే చెప్పుకున్నట్లే RJ కాజల్, విశ్వ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ అయిన విశ్వ కంటే ఆర్జే కాజల్ ఓట్ల శాతం తక్కువ. మనందరికీ తెలిసినట్లుగా, కొన్నిసార్లు స్టార్ మా వారి TRP రేటింగ్‌లను కాపాడుకోవడానికి ఒక పోటీదారుని ఎలిమినేషన్ నుండి కాపాడుతుంది. ఎలిమినేషన్ పదో వారంలోనూ ఇదే వ్యూహం అమలు చేశారు షో నిర్వాహకులు.
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, RJ కాజల్ స్థానంలో విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఏదిఏమైనా ప్రతి వారం టాస్క్‌లలో విశ్వ బాగానే ఆడాడు. కానీ అదృష్టం అతడికి దక్కలేదు. ఇంటి బయట విశ్వకు అంత ఆదరణ లేదని ఓ వర్గం ప్రేక్షకులు అన్నారు. కాబట్టి విశ్వ ఎలిమినేషన్‌కు ఇది ఒక కారణం కావచ్చు. అయితే మొత్తానికి బిగ్ బాస్ లో 62 రోజులు ఉన్న విశ్వ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
అయితే విశ్వ కి రోజు కి 35 వేలు చొప్పున బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలా మొత్తానికి దగ్గర దగ్గర గా 62 రోజులకి గాను 22 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.