Hydra Commissioner AV Ranganath: హైదరాబాదులో ప్రభుత్వ చెరువులను, కుంటలను, నాలాలు పరిరక్షించేందుకు రేవంత్ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. హైడ్రాను తీసుకొచ్చిన నాటి నుంచి హైదరాబాదులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను.. చెరువులను, నాలా లను పరిరక్షిస్తోంది. ఇటీవల హైడ్రా కోసం ప్రభుత్వం ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా నిర్మించింది. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించడానికి ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది.
హైడ్రా ద్వారా చేపడుతున్న పనులను ఆ సంస్థ అధిపతి రంగనాథ్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఈ విభాగాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆయన మానస పుత్రిక కాబట్టి దాని కార్యకలాపాలను.. సాధిస్తున్న ప్రగతిని ఆయన గమనిస్తున్నారు. వాస్తవానికి హైడ్రా ఏర్పాటును కాంగ్రెస్ నాయకులు స్వాగతిస్తుండగా.. గులాబీ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా చేసింది ఏమీ లేదని.. హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని ఆరోపిస్తోంది. గులాబీ పార్టీ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. హైడ్రా పనితీరు మాత్రం మెజారిటీ ప్రజల అభిమానాన్ని పొందుతున్నది.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, కబ్జాల తొలగింపు వంటి బహుళ విధానాలలో హైడ్రా పనిచేస్తోంది. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. చెరువులలో, కాలువలలో ఆక్రమణలు తొలగించింది. ప్రకృతిని పరిరక్షించింది. హైదరాబాద్ నగరానికి సరికొత్త భవిష్యత్తును అందించింది. ఇప్పుడు వస్తున్న ఆరోపణ సంగతి ఎలా ఉన్నా.. హైడ్రా చేసిన పనులు భవిష్యత్తులో హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో ఉపయోగాన్ని ఇస్తాయని హైడ్రా అధిపతి రంగనాథ్ చెబుతున్నారు. హైడ్రా చర్యలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో అవి ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తాయని రంగనాథ్ దీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు హైడ్రా 581 ఆక్రమణలు తొలగించింది. ఇందులో బడా బాబులవే ఎక్కువగా ఉన్నాయని రంగనాథ్ పేర్కొన్నారు.