Aamir Khan Meghalaya Case: ఆ ఘోరం సృష్టించిన సంచలనం అంతా కాదు. ఆ దారుణం కలిగించిన అలజడి మాములుది కాదు. దేశ వ్యాప్తంగా మీడియా మొత్తం ఆ ఘటన చుట్టూ తిరిగింది. రోజుకో తీరైన సమాచారం బయటికి రావడంతో ఆ దుర్మార్గ కాండ నేర కథా చిత్రాలను మించిపోయింది. చివరికి పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందారు. ఆ ఘటనలో అడుఅడుగునా ట్విస్టులు ఉన్నాయి. ఊహించని మలుపులు ఉన్నాయి. అందువల్లే ఈ దారుణం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.. గతంలో కేరళలో సైనైడ్ పెట్టి కుటుంబ సభ్యులను హతమార్చిన ఓ యువతి ఘటన ఎంతైతే సంచలనం సృష్టించిందో.. మేఘాలయలో జరిగిన హనీమూన్ దారుణం కూడా అదే స్థాయిలో కలకలం సృష్టించింది..
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. స్పీచ్ తో మళ్లీ అదరగొట్టిన పవన్!
ఈ ఘటన మొత్తం సినిమాటిక్ గా ఉండడంతో.. దీనిపై ఒక చిత్రాన్ని రూపొందించేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమా నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ ఘటనకు సంబంధించి ఆయన కొద్ది రోజులుగా పలు వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకు వెల్లడి కాలేదు.. కొద్దిరోజులుగా మాత్రం అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఇండోర్, మేఘాలయ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది వ్యక్తులను కలిసి పలు వివరాలను సేకరిస్తున్నారు.. ఈ కేసు కు సంబంధించి పోలీసు, ఇతర శాఖల అనుమతి తీసుకున్న తర్వాత చిత్ర నిర్మాణం వైపు అడుగులు వేస్తారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవ కథలతో బాలీవుడ్లో సినిమాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. కాకపోతే పూర్తిగా నేర కథ తో సినిమాలు తీయడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో బాలీవుడ్ లో నేరాలను ప్రభావితం చేసిన వ్యక్తుల నిజ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తీసేవారు. అయితే ఇప్పుడు వాటికి కాలం చెల్లిపోవడంతో ఇటువంటి ఘటనల ఆధారంగా సినిమాలు తీయడానికి బాలీవుడ్ పెద్దలు ముందుకు వస్తున్నారు. పైగా ఇలాంటి సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. ప్రేక్షకులకు అంచనాలు అమాంతం పెరుగుతాయి. అందువల్లే ఈ సినిమాను రూపొందించడానికి అమీర్ ఖాన్ ముందుకు వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని వినికిడి. పూర్తిగా యువనటులతో ఈ సినిమాను రూపొందిస్తారని.. సినిమాటిక్ లిబర్టీ కాకుండా వాస్తవ కథ తోనే చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. కొంతకాలంగా అమీర్ ఖాన్ నటించిన సినిమాలు గొప్ప విజయాలను సాధించిన దాఖలాలు లేవు. బాక్స్ ఆఫీస్ వద్ద అవన్నీ దారుణ వైఫల్యాలుగా పేరుపొందాయి. ఈ చిత్రంతోనైనా సక్సెస్ బాటలో నడవాలని అమీర్ ఖాన్ యోచిస్తున్నట్టు సమాచారం. అందువల్లే ఈ కథను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.