Hari Hara Veera Mallu Pre Release Event హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా సాఫీగా సాగిపోయింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇంత ఎమోషనల్ గా ఆయన అభిమానుల గురించి ఈమధ్య కాలం లో ఎప్పుడూ మాట్లాడలేదు. పొలిటికల్ ఈవెంట్స్ లో చాలా సార్లు మాట్లాడాడు కానీ, ఈరోజు ఎందుకో ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా వచ్చింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం.
ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ లో నేను నిర్మాత AM రత్నం గారి గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు మాత్రం కేవలం మీ కోసం మాత్రమే మాట్లాడుతాను. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నన్ను వదలకుండా నాతో పాటు ఉన్నది మీరు ఒక్కటే. అందరి సినిమాలు మంచి టికెట్ రేట్స్ తో విడుదల అవుతుంటే, నా సినిమా కి మాత్రం పది రూపాయిలు, 15 రూపాయిల టికెట్ రేట్స్ ఉండేవి. ఆరోజే నేను మీకు చెప్పాను, మనల్ని ఎవడ్రా ఆపేది అని, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, టికెట్ రేట్స్ వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. రీమేక్ సినిమాలు చేయడం పై వివరిస్తూ ‘మీరంతా నేను రీమేక్ సినిమాలు చేస్తుంటాను అని అంటూ ఉంటారు. కానీ ఏమి చేయమంటారు చెప్పండి. మనకి డైరెక్టర్స్ ఏమో దొరకరు, అలాంటి సమయం లో నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి,పార్టీ ని నడుపుకోవాలి కదా, అప్పుడు రీమేక్ సినిమాలే నాకు చాలా సులువు అయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ‘సుఖాల్లో ఉన్నప్పుడు నా వద్దకు చాలా మంది వచ్చేవారు. కానీ నాకు వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత ఒకే ఒక్క భారీ ఫ్లాప్ నన్ను చిక్కుల్లో పెట్టింది. ఆ ఫ్లాప్ నుండి ఎలా కోలుకోవాలో తెలియని పరిస్థితి లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయన అందించిన ‘జల్సా’ చిత్రం తోనే మళ్ళీ నేను సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాను. నా మిత్రుడు, ఆత్మబంధువు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.