OG OTT Release Date: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం తెలుగు వెర్షన్ నుండి రాబట్టి సంచలనం సృష్టించింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లీన్ హిట్ సినిమాగా నిల్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లో ఈ సినిమా విఫలం అయ్యింది. ఈమధ్య కాలం లో వస్తున్న సూపర్ హిట్ సినిమాలు కూడా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం . ఉదాహరణకు పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు.
ఇలా ఈమధ్య కాలం లో అన్ని సూపర్ హిట్ సినిమాలకు జరుగుతున్నాయి కాబట్టి, ఓజీ ని అంత సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. నిన్నటి నుండి అనేక ప్రాంతాల్లో షేర్స్ రావడం ఆగిపోయాయి. ఇక ఎంత షేర్ వసూళ్లు వచ్చినా ఈ వారం లోనే రావాలి, దీపావళి వరకు రన్ ఉండే అవకాశం ఉంది. కానీ మహా అయితే ఇంకా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో ఈ సినిమా ఓటీటీ లో విడుదలకు సిద్ధం కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం, నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి అయ్యాక ఓటీటీ లో విడుదల చేయాలి.
మరో రెండు రోజుల్లో మూడు వారాలు పూర్తి చేసుకోబోతోంది ఈ చిత్రం. మరుసటి వారం లో ఏకంగా నాలుగు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ కారణం చేత థియేటర్స్ నుండి ఈ సినిమా పూర్తిగా వైదొలిగే అవకాశం ఉండడం తో అక్టోబర్ 23 న ఈ చిత్రం ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరికొంత మంది అయితే అవన్నీ ఫేక్ రూమర్స్ అని, ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ లోనే వస్తుందని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది. అయితే ఓటీటీ వెర్షన్ లో ఎడిటింగ్ లో తీసినవేయబడిన సన్నివేశాలతో జత చేసి విడుదల చేస్తారట. చూడాలి మరి ఈ అన్ కట్ వెర్షన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.