OG Movie Ticket: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం పై అభిమానులు పెట్టుకున్న ఆశలు, అంచనాలను దగ్గరుండి మరీ చూస్తే మేకర్స్ కచ్చితంగా భయపడుతారేమో. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు కేవలం మూడు కంటెంట్లు మాత్రమే వచ్చాయి. పాటలు కాకుండా, సినిమా కథ ని తెలిపే విధంగా ఒకే ఒక్క గ్లింప్స్ వీడియో వచ్చింది. ఆ తర్వాత టీజర్ లేదా, ట్రైలర్ వంటివి విడుదల చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతటి భారీ అంచనాలు ఏర్పడినప్పుడు ఏ డైరెక్టర్ కి అయినా భయం వేస్తుంది. పైగా సుజీత్ లాంటి కొత్త డైరెక్టర్స్ కి అయితే మరీనూ. అందుకే భారీ లెవెల్ ప్రొమోషన్స్ చేయకుండా, కేవలం పరిమితికి తగ్గ ప్రొమోషన్స్ ని మాత్రమే చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పై అభిమానులు ఎంత అంచనాలు పెట్టుకున్నారో ఒక ఉదాహరణ చెప్పబోతున్నాము.
Also Read: ‘వార్ 2’ ఎఫెక్ట్..డ్రాగన్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్న ప్రశాంత్ నీల్!
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ, OG మూవీ నైజాం ప్రాంతం మొట్టమొదటి టికెట్ ని వేలం పాట కార్యక్రమాన్ని నిన్న ట్విట్టర్ లో ఒక వీరాభిమాని పెట్టాడు. ఎదో లక్ష, రెండు లక్షల వరకు ఈ వేలం పాట వెళ్తుందని అనుకుంటే, ఏకంగా 5 లక్షల రూపాయలకు వెలంపేట చేరింది. నార్త్ అమెరికా కి చెందిన ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఈ మొట్టమొదటి టికెట్ ని కొనుగోలు చేశాడు. వేలం పాట ద్వారా వచ్చిన ఈ డబ్బులను జనసేన పార్టీ కి విరాళం గా అందించబోతున్నారట. త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనుంది. ఒక సినిమా టికెట్ కోసం 5 లక్షల రూపాయిల వేలంపాట ఇప్పటి వరకు చరిత్రలో ఏ సినిమాకు కూడా జరగలేదు. దీనిని బట్టీ ఈ సినిమా ని అభిమానులు ఎంత ఎమోషనల్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
డైరెక్టర్ సుజిత్ కూడా ఆ అంచనాలను మనసులో పెట్టుకొని, చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అట. అసలు మనం పవన్ కళ్యాణ్ ని ఎలాంటి తోపు కంటెంట్ సినిమాల్లో చూడాలి?, ఎలాంటి రీమేక్ సినిమాల్లో చూడాల్సి వస్తుంది అంటూ బాధపడే ప్రతీ అభిమానికి సమాధానం గా ఈ చిత్రం ఉంటుందట. ఇకపోతే నేడు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన రెండవ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కి ఎదో ఒక కొత్త కంటెంట్ అవసరం ఉంటుంది. రీసెంట్ గానే మొదలైన ఈ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 1 మిలియన్ మార్కు కి అతి చేరువకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాలంటే కచ్చితంగా కొత్త కంటెంట్ రావాలి. మరి ఈరోజు విడుదల అవ్వబోయే ఆ కొత్త కంటెంట్ ఈ సినిమా రేంజ్ ని ఎంత వరకు తీసుకెళ్తుందో చూద్దాం.