Dragon Script Changes: గత 12 ఏళ్ళ నుండి హిట్/బ్లాక్ బస్టర్ అనే పదాలు తప్ప, అభిమానులకు ఫ్లాప్ అనే పదం స్పెల్లింగ్ కూడా తెలియకుండా చేసిన ఎన్టీఆర్(Junior NTR) కి ‘వార్ 2′(war2 movie) ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. ‘టెంపర్’ నుండి ‘దేవర’ వరకు వరుసగా 7 హిట్లు అందుకున్న ఎన్టీఆర్, ఈ సినిమా తో 8వ హిట్ ని అందుకుంటాడని అనుకుంటే కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు. విలన్ క్యారక్టర్ లో ఎందుకో ఎన్టీఆర్ ని ప్రేక్షకులు చూడలేకపోయారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ అలాంటి పాత్ర చేయడం తో, క్లైమాక్స్ ఆయన అభిమానులను సంతృప్తి పరిచేలా పెట్టాల్సి వచ్చింది. దీంతో సినిమా సోల్ చెడిపోయిందని, ఫలితంగా నార్త్ ఇండియన్స్ కూడా కనెక్ట్ కాలేకపోయారని విశ్లేషకుల అభిప్రాయం. ‘వార్ 2’ ఫలితాన్ని చూసిన తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్’ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడట.
Also Read: ఆరోజు చిరంజీవి ని నమ్మనందుకు రిస్క్ లో పడిన ఎన్టీఆర్ కెరీర్.. అసలు ఏమైందంటే!
ఈ చిత్రం లో కూడా ఎన్టీఆర్ పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్నాడట. అభిమానులు తనని అలాంటి క్యారెక్టర్స్ లో చూడలేకపోతున్నారని, సినిమాలో కాస్త ఎమోషనల్ ట్రాక్ ఎక్కువ ఉండేలా చూడాలని ప్రశాంత్ నీల్ ని రిక్వెస్ట్ చేసాడట. అందుకు నీల్ కూడా ఓకే చెప్పి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. యదార్ధ ఘటనలు ఆధారంగా తీసుకొని సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సినిమా అట ఇది. ఇప్పటికే ఎన్టీఆర్ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ‘దేవర’ చిత్రం చేసాడు. ఇప్పుడు అదే బ్యాక్ డ్రాప్ లో ఆయన మరో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న సమయం నుండే ఈ సినిమా పై హైప్ పీక్ రేంజ్ కి చేరుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి ఒక్కో అప్డేట్ వస్తే అంచనాలు వేరే లెవెల్ కి చేరుకుంటాయి. ఈ దసరా కి ఈ చిత్రం నుండి టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.