Kieron Pollard Sixes: “ఆ రోజున వాడు తెగ నరుకుతా ఉంటే.. కత్తికి మీసం మొలిచిందేమో అనిపించింది.. వాడి చూపులో భయం లేదు. అడుగులోన్బెదురు లేదు.. వెన్నులో వణుకు లేదు. ఎట్టా పుట్టుంటాడు స్వామి..” ఒక సినిమాలో హీరోను ఉద్దేశించి విలన్ పలికిన మాటలు ఇవి. ఈ మాటలు వాస్తవరూపం దాల్చితే.. సోమవారం నాటి కిరణ్ పోలార్డ్ ఇన్నింగ్స్ కు ఉపమానించవచ్చు. మామూలు బ్యాటింగ్ కాదది.. ఊచ కోత కోశాడు. బౌలర్ బంతిని పట్టుకోవాలంటేనే భయపడేలా చేశాడు.
సిపిఎల్ లో భాగంగా ట్రిని బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. సెయింట్ కిట్స్, నెవిస్ పాట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వరుసగా 8 బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టాడు.. నవియాన్, వకార్ బౌలింగ్ లో ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. మొత్తంగా 29 బంతుల్లోనే అతడు 65 పరుగులు చేశాడు. ఇతడికి పూరన్(53*) కూడా తోడు కావడంతో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఐపీఎల్ లో పోలార్డ్ తన చివరి మ్యాచ్ 2022లో ఆడాడు. అప్పుడు అతడు ముంబై జట్టులో ఉన్నాడు.. పొలార్డ్ ఐపీఎల్లో 189 మ్యాచులు ఆడాడు. 3,412 పరుగులు చేశాడు. ఇందులో 16 అర్థ శతకాలు ఉన్నాయి.. ఇతడి హైయెస్ట్ స్కోర్ 87* పరుగులు. బౌలింగ్లో 69 వికెట్లు పడగొట్టాడు. సాధారణంగా పొలార్డ్ భీకరంగా ఆడుతాడు. ఏమాత్రం భయం అనేది లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ విషయంలో కూడా అతడు అదే స్టైల్ చూపిస్తాడు. భారీ శరీరంతో ఉన్నప్పటికీ అద్భుతమైన ఫిట్నెస్ కనబరుస్తాడు. అందువల్లే అతడిని క్రికెట్లో మిస్టర్ బీస్ట్ అని పిలుస్తుంటారు. అతడు ఆడే ఆట.. వేసే బౌలింగ్ కూడా అలానే ఉంటుంది.
KIERON POLLARD HAS SMASHED 7 SIXES IN 8 BALLS IN THE CPL. pic.twitter.com/aNGLmmwpbA
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 1, 2025