OG Movie: ఎక్స్ క్లూసివ్ : ఓజీ విడుదల తేదీ వచ్చేసింది..సెప్టెంబర్ నుండి పవన్ ఫ్యాన్స్ కి ప్రతీరోజు పండగే!

అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆ స్థాయి హిట్ ఇప్పటి వరకు రాలేదు. రీ ఎంట్రీ తర్వాత 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' మరియు 'బ్రో' వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడినప్పటికీ అప్పటి ప్రభుత్వం యొక్క కక్ష్య సాధింపు చర్యల కారణంగా 200 కి అమ్మాల్సి టిక్కెట్లను, కేవలం 80 రూపాయలకు మాత్రమే అమ్మే చట్టం తీసుకొచ్చారు.

Written By: Vicky, Updated On : August 15, 2024 9:58 pm

OG Movie

Follow us on

OG Movie: పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఏడాది ఏ హీరో అభిమాని కూడా పొందని రేంజ్ సంతోషంలో ఉన్నారు. పదేళ్ల నుండి పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ అవ్వాలని వాళ్లంతా ఎంతో కోరుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతీ చోట బంపర్ మెజారిటీ తో గెలిపించుకునేందుకు ఎంతో శ్రమించారు. శ్రమకి తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయి. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో పోటీ చేసిన అన్నీ స్థానాల్లోనూ అఖండ మెజారిటీలతో గెలిచి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని స్థాపించారు. తమ ఆరాధ్య దైవాన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంతో పాటు, 5 ముఖ్యమైన శాఖలకు మంత్రిగా చూసి ఎంతో మురిసిపోయారు. ఇక అభిమానులు చిరాకాల కోరికైన ముఖ్యమంత్రి స్థానానికి అడుగు దూరంలో ఉన్నాడు. రాజకీయంగా అభిమానులు కోరుకున్నది జరిగింది. కానీ సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు బాకీ ఉన్నాడు.

అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆ స్థాయి హిట్ ఇప్పటి వరకు రాలేదు. రీ ఎంట్రీ తర్వాత ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ మరియు ‘బ్రో’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా ఆడినప్పటికీ అప్పటి ప్రభుత్వం యొక్క కక్ష్య సాధింపు చర్యల కారణంగా 200 కి అమ్మాల్సి టిక్కెట్లను, కేవలం 80 రూపాయలకు మాత్రమే అమ్మే చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు బాగా నష్టపోయాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, చంద్రబాబు – పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు టికెట్ రేట్స్ ఒకప్పుడు ఎలా ఉండేవో, అలా ఉంటాయి. అలాగే ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మిడ్ నైట్ షోస్, బెన్ఫిట్ షోస్ ఎలా ఉండేవో, ఇప్పుడూ అలాగే ఉండబోతుంది. ఇలాంటి సమయం లో ఆయన చేస్తున్న చిత్రాలలో విపరీతమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రం ఓజీ. ఈ సినిమా పేరు ఎత్తితే చాలు అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

ఆ టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద హైప్ ని పదింతలు రెట్టింపు చేసింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఇప్పుడు ఆయన ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చేసాడు. సెప్టెంబర్ నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. మార్చి 27 లేదా 28 వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ప్రకటించనున్నారు. అదే రోజున ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యనున్నారు. ఇక సెప్టెంబర్ నెల నుండి ఓజీ సంబంధించి ఎదో ఒక వార్త అభిమానులకు వస్తూనే ఉంటుందని తెలుస్తుంది. అభిమానుల 12 ఏళ్ళ ఆకలిని ఈ చిత్రంతో తీర్చబోతున్నాడు పవన్ కళ్యాణ్.