OG Movie Promotions: అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరోగా సుజిత్(Sujeeth) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం రీసెంట్ గానే పూర్తి అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చెప్పడం మొదలు పెట్టాడు. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం అభిమానులను నిరాశ పరిచింది. దీంతో వాళ్ళు ఆశలన్నీ ఓజీ చిత్రం పైనే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు రెండు నెలలకంటే తక్కువ సమయం ఉండడంతో అభిమానులు ప్రొమోషన్స్ ఆగష్టు నెల నుండి మొదలు పెడతారేమో అని ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ‘ఫైర్ స్ట్రోమ్’ అనే పాట విడుదలకు సిద్ధమైంది. తమిళ హీరో శింబు(Silambarasan TR) ఈ పాట పాడాడు. థమన్ స్వరపరిచిన ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని, మొదటిసారి విన్నప్పుడే అభిమానులకు ఈ పాట పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని చాలా బలమైన నమ్మకంతో చెప్తున్నారు మేకర్స్. అయితే ప్రొమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నాము అని చెప్పడానికి ఆ చిత్ర డైరెక్టర్ సుజిత్ నుండి విడుదలైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
ఈ వీడియోని చూస్తుంటే ఓజీ టీం కూడా అనిల్ రావిపూడి ట్రెండ్ ని అనుసరిస్తున్నట్టు ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సమయం లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) చేసిన ప్రొమోషన్స్ ఒక సెన్సేషన్. సినిమా మీద జనాల్లో అంచనాలు పెంచడానికి ఆ ప్రొమోషన్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఇదేదో బాగుందే అని ప్రతీ డైరెక్టర్ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఓజీ మూవీ టీం కూడా అదే ట్రెండ్ ని అనుసరించడం విశేషం. తన స్నేహితులు ‘ఏంటి పరిస్థితి’ అనే షో ని నిర్వహిస్తున్నారు. ఈ షో కి ముఖ్య అతిథిగా వచ్చిన సుజిత్ ని యాంకర్ ఓజీ అప్డేట్స్ ని మొహమాటం తో అడగడం, దానికి సుజిత్ ‘ఓజీ అప్డేట్స్ కదా..దానిదేముంది’ అంటూ సమాధానం ఇచ్చిన వీడియో ని పవన్ అభిమానులు ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆగష్టు 1 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చెయ్యాలి. కానీ అందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. బహుశా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలై థియేటర్స్ లో నడుస్తుంది కదా, ఆ సినిమాని డిస్టర్బ్ చెయ్యకూడదు అనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఓజీ అప్డేట్ ని ఒక వారం రోజుల వరకు హోల్డ్ లో పెట్టరేమో అని అనిపిస్తుంది. ఒక్కసారి ఓజీ అప్డేట్స్ రావడం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల్లోకి రాబోయే ఈ రెండు నెలలు సోషల్ మీడియా వెళ్ళిపోతుందని అనుకోవచ్చు.