Hari Hara Veeramallu Latest Colletions Report: బాగున్న సినిమాకు ఎన్ని అడ్డంకులు పెట్టినా జనాలు చూడకుండా ఉండరు, జోరు వాన, సునామీలు వస్తున్న రోజుల్లో కూడా విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. అదే విధంగా బాగాలేని సినిమాలను ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా జనాల్లోకి తీసుకెళ్ళలేము, పైగా ఇది ఓటీటీ యుగం,బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్ కి కదులుతున్నారు, లేదంటే ఓటీటీ లో చూసుకోవచ్చులే అనే ధోరణితో ఉంటున్నారు. కరోనా తర్వాత జనాల్లో ఈ విధమైన మార్పులు వచ్చాయి. క్వాలిటీ లేని సినిమాలను జనాలు అసలు కేర్ చేయడం లేదు. అందుకు లేటెస్ట్ ఉదాహరణ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ప్రొడక్షన్ స్థాయి నుండే ఎన్నో అడ్డంకులను ఎదురుకుంటూ, ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది.
ఆ టాక్ ప్రభావం సినిమా పై చాలా బలంగా పడింది. దీంతో కళ్ళు చెదిరే వసూళ్లు చూస్తామని అనుకున్న బయ్యర్స్ కి, రెండవ రోజు నుండి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది ఈ చిత్రం. అయితే ఆ చిత్ర నిర్మాత AM రత్నం(AM Ratnam) మాత్రం పైకి మా సినిమా సూపర్ హిట్, ఎవరో ఒకరిద్దరు మా చిత్రం లోని చిన్న చిన్న నెగటివ్స్ ని తీసుకొని పెద్దది చేసి చూపిస్తున్నారని, కానీ జనాలు అవన్నీ పట్టించుకోరని, మా సినిమాకు బ్రహ్మాండమైన వసూళ్లు వస్తున్నాయని మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నాడు నిర్మాత AM రత్నం. అయితే నోరు ఎన్ని అబద్దాలు చెప్పినా, కళ్ళు నిజం చెప్తుందని పెద్దలు అంటుంటారు. AM రత్నం మాట్లాడేటప్పుడు అతని ముఖాన్ని చూస్తేనే సినిమా ఫలితం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏడవలేక, మనసులోనే కుమిలిపోతూ, పైకి నవ్వుతూ నటించడం అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.
ఆయన కళ్ళని చూసి అయ్యో పాపం రత్నం గారు, పాపం ఆయన పరిస్థితి అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి రెగ్యులర్ గా సినిమాలను నిర్మించని ఒక నిర్మాత, ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని చెయ్యాలని అనుకోవడం ఒక పెద్ద సాహసమే. అలాంటి భారీ బడ్జెట్ చిత్రం కొన్ని అనుకోని దురదృష్టకారణాల వల్ల వాయిదా పడుతూ వస్తే ట్రెండింగ్ లో ఉన్న నిర్మాతలే తట్టుకోలేరు, అలాంటిది AM రత్నం లాంటి ట్రెండింగ్ లో లేని నిర్మాత తట్టుకోగలడా?, కానీ తట్టుకున్నాడు, ఎన్నో కష్టాలను అధిగమించి ఈ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అందరూ సూపర్ హిట్ అవ్వాలనే కోరుకున్నారు, కానీ సినిమాలో నాసిరకమైన గ్రాఫిక్స్ ని ఉపయోగించి, ఆడియన్స్ ఎలా ఉన్న చూసేస్తారు లే అనే ధోరణితో వ్యవహరించినట్టు జనాలకు అనిపించడంతో ఈ చిత్రాన్ని డిజాస్టర్ చేశారు.