OG Movie Hindi version collections: సరైన ప్లానింగ్ లేకపోవడం కొన్ని సినిమాలకు అపరిమితమైన రేంజ్ ఉన్నప్పటికీ చాలా లిమిటెడ్ గా వెళ్లాల్సి వస్తుంది. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం ఆ కోవకు చెందిన సినిమానే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ థియేట్రికల్ రన్ తో ముందుకు దూసుకుపోతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, 142 కోట్ల రూపాయిల పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పబోతోంది. అంతా బాగానే ఉంది కానీ, ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితం చేశారు మేకర్స్. హిందీ, తమిళం మరియు ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
అక్కడ మంచి బయ్యర్స్ ని పట్టుకొని భారీ థియేట్రికల్ రిలీజ్ ఇవ్వడం లో నిర్మాత ఘోరంగా విఫలం అయ్యాడు. ఫలితంగా చాలా లిమిటెడ్ రిలీజ్ ని చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ లో అసలు నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవ్వలేదు. అందుకు ముఖ్య కారణం ఓటీటీ విండో కేవలం 4 వారాలకు పరిమితం చేయడం వల్లే. ఫలితంగా సింగల్ స్క్రీన్స్, కొన్ని ముఖ్యమైన మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రమే ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆ థియేటర్స్ లో జనాలు సినిమాలు చూసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అయినప్పటికీ కూడా ఈ చిత్రం డీసెంట్ రేంజ్ గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. అక్కడి ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో కేవలం 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
కానీ నిన్న 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈ చిత్రం, నేడు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుందట. అంటే నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు వస్తాయి అన్నమాట. ఇలా హిందీ వెర్షన్ వసూళ్లు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి. కనీసం నిర్మాతలు ఇప్పటికైనా ఓటీటీ ని 8 వారాలకు పొదిగించుకుని, నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో హిందీ వెర్షన్ ని విడుదల చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను నిర్మాతలు నెరవేరుస్తారో లేదో చూడాలి.