India vs Pakistan : సైలెంట్ గా ఉండే టీమిండియా కోచ్ గౌతం గంభీర్ రెండు చేతులు బల్లపై గట్టిగా చరుస్తూ అరిచేయడం.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ రింకూ విన్నింగ్ షాట్ కొట్టడం.. కష్టతరం నుంచి టీమిండియాను ఒడ్డున పడేసే వరకూ తిలక్ వర్మ వీరోచిత పోరాటం.. గెలిచాక ఆనందంతో అట్టహాసలు భీకరంగా చేయడం.. టీమిండియా శిబిరంలో ఆనందాలు ఇలా అన్నీ కలగలిపిన ఆ అద్భుత విజయ క్షణాలను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.. అదిప్పుడు వైరల్ అవుతోంది..
Special Team
Special TriumphFrom Dressing Room to the Field of Play – Scenes right through the final moments before #TeamIndia completed a stunning win in #AsiaCup2025 #Final! pic.twitter.com/P2hfjarLQl
— BCCI (@BCCI) September 29, 2025
ఆసియా కప్ 2025లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ సాధించిన ఉత్కంఠభరిత విజయం… దుబాయ్‌లో భారతీయ అభిమానుల పాలిట ఓ మినీ-పండుగలా మారిపోయింది. ముఖ్యంగా దుబాయ్ వ్యాపార కేంద్రమైన బుర్ దుబాయ్‌లోని మీనా బజార్ ప్రాంతం ఒక్కసారిగా దేశభక్తి, ఆనందోత్సాహాల ‘చిన్న స్టేడియం’లా మారిపోయింది.
Watch: Crazy celebrations in Dubai streets as India wins Asia Cup 2025 against Pakistan
The moment that last ball secured India’s victory, crowds went wild and joyoushttps://t.co/0JeqAhptjt pic.twitter.com/kRzzXmk55s
— Gulf News (@gulf_news) September 28, 2025
అద్భుత విజయ క్షణాలున్నా బీసీసీఐ తాజాగా విడుదల చేసిన వీడియోలో టీమిండియా శిబిరంలో కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ సైతం ఉద్వేగానికి లోనై రెండు చేతులు బల్లపై గట్టిగా చరుస్తూ అరిచేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch: Indian fans celebrate Asia Cup win in Dubai’s Meena Bazaarhttps://t.co/0JeqAhptjt pic.twitter.com/laWQrhSfqI
— Gulf News (@gulf_news) September 28, 2025
మీనా బజార్‌లో క్రికెట్ ‘కార్నివాల్’
నిజానికి షాపింగ్, మసాలా దుకాణాలు, డిజైనర్ వస్తువులకు ప్రసిద్ధి చెందిన మీనా బజార్ వీధులు, విజయం దక్కగానే ఆనందోత్సాహాలతో కిక్కిరిసిపోయాయి. ఆఖరి బంతి గెలుపుని భారత్ వైపు తిప్పగానే, పటాకులు, ఢోలు, హారన్‌లు, తాళాలు, కేకలు అన్నీ కలగలసి గగనంలో మార్మోగాయి. ఆ ప్రాంతం మొత్తం పెద్ద డాన్స్ ఫెస్టివల్‌లా వాతావరణాన్ని తలపించింది.
ఒక మూలలో ఉత్తరాది స్టైల్‌లో బంగ్రా డ్యాన్స్‌లు హోరెత్తుతుంటే, మరో మూలలో యువతతో పాటు పెద్దవాళ్లు సైతం స్టెప్పులేస్తూ సంబరాలు చేసుకున్నారు. స్నేహితులను భుజాలపై ఎత్తుకుని ఊగిపోవడం అక్కడి వీధుల్లోని కొత్త ‘స్ట్రీట్ స్పోర్ట్’గా మారింది.
చాయ్ గ్లాసులతో పండుగ
ఈ ఆనందోత్సవంలో టీ స్టాళ్ల యజమానులు కూడా భాగమయ్యారు. ప్రజల ఆనందాన్ని పంచుకుంటూ, వేడివేడిగా చాయ్ గ్లాసులను ఉచితంగా పంపిణీ చేశారు. తెలియని వ్యక్తులు కూడా ఒకే టీమ్‌గా మారి, భారత విజయాన్ని పంచుకున్నారు.
పటాకుల పొగ, చక్కెర వాసన, ఉత్సాహం కలగలిసి… ఆ గాలిలో ఆనందమే నిండిపోయింది. ఎన్నో ఆఫర్లు, జనసందోహాలను చూసిన మీనా బజార్, ఇలాంటి క్రికెట్ కార్నివల్‌ను మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండదనే చెప్పాలి.