OG Movie 4 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తుంది. సాధారణంగా లాంగ్ వీకెండ్ తర్వాత ఏ సినిమా అయినా మొదటి సోమవారం రోజున బాగా డౌన్ అవుతుంది. కానీ ఓజీ చిత్రం నూన్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఆడియన్స్ లో నిజమైన పాజిటివ్ టాక్ ఉంటే కలెక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటాయా అని నేడు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 166 కోట్ల రూపాయలకు జరిగింది.
మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది ఈ క్రేజీ సినిమా. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 41 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. పవన్ కళ్యాణ్ కి ఇది ఈ ప్రాంతంలో మొట్టమొదటి 40 కోట్ల షేర్ సినిమా అని చెప్పొచ్చు. అదే విధంగా సీడెడ్ లో 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర లో కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక తూర్పు గోదావరి జిల్లాలో అయితే నాలుగు రోజుల్లోనే 10 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. కేవలం సంక్రాంతి సినిమాలకు మాత్రమే ఈ ప్రాంతంలో ఈ రేంజ్ వసూళ్లు వస్తుంటాయి.
అలాంటి ఓజీ చిత్రం మొదటి వారం కూడా పూర్తి కాకముందే పది కోట్ల షేర్ ని కొల్లగొట్టడం హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కోటి 60 లక్షలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టినప్పుడే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే, నెల్లూరు జిల్లాలో కూడా ఈ చిత్రానికి నాలుగు రోజుల్లోనే 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొదటి వారం షేర్ కచ్చితంగా 5 వరకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో అయితే నార్త్ అమెరికా లో 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అతి తక్కువ రేటింగ్స్ తో ఈ రేంజ్ గ్రాస్ ని రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమా ఇదే అవ్వడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది చూడాలి.