OG Collection Day 13: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం విడుదలై నేటితో రెండు వారాలు పూర్తి కానుంది. విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ క్రేజ్, హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఆ హైప్ ని అందుకోగలదా అనే అనుమానాలు, భయాలు అభిమానుల్లో ఉండేవి. కానీ విడుదల తర్వాత ప్రీమియర్ షోస్ నుండే అభిమానుల నుండి పాజిటివ్ టాక్ రావడం తో ఈ సినిమాకు మొదటి రోజే 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఫ్యాన్స్ లో ఉన్న పాజిటివ్ టాక్ మామూలు ఆడియన్స్ లో లేకపోవడం తో రెండవ రోజు నుండి నాల్గవ రోజు వరకు డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. భారీ రేట్స్ కి కొనుగోలు చేసిన బయ్యర్స్ కాస్త తడబడ్డారు. కానీ వర్కింగ్ డేస్ లో స్టడీ హోల్డ్ ని కొనసాగించడం, రెండవ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద విలయతాండవం ఆడడంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది.
13 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రం అక్షరాలా 50 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. పవన్ కళ్యాణ్ కి ఇది ఈ ప్రాంతం లో మొట్టమొదటి 50 కోట్ల చిత్రం, అదే విధంగా నైజాం ప్రాంతం లో 50 కోట్ల షేర్ మార్కుని అందుకున్న 7వ సినిమాగా ఈ చిత్రాన్ని పరిగణిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 17 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర నుండి 16 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 8 కోట్ల 12 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 10 కోట్ల 83 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 9 కోట్ల 50 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 4 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 129 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. నేటితో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలు పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాయి. నైజాం ప్రాంతం ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా దీపావళి వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా దీపావళి వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉండగా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో స్వల్ప నష్టాలు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది.