Kantara 2 Collection Day 6: ఈమధ్య కాలం లో పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతున్న చిత్రాల లిస్ట్ తీస్తే,అందులో కాంతారా 2(Kantara: The Chapter 1) కచ్చితంగా ఉంటుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వీకెండ్ వరకు ఈ సినిమాకు ఎలాంటి వంక పెట్టడానికి లేదు. భారీ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది. కానీ సోమవారం నుండి ఒక్క కర్ణాటక లో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. కాంతారా మొదటి భాగం అద్భుతమైన థియేట్రికల్ రన్ ని మన రాష్ట్రాల్లో సొంతం చేసుకోవడంతో, ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈ ‘కాంతారా : ది చాప్టర్ 1’ 93 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. నైజాం ప్రాంతం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకోగా, ఆంధ్ర ప్రదేశ్ హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకున్నారు.
మొదటి 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆరవ రోజున ఈ చిత్రానికి 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. మొత్తం మీద 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ సినిమా 46 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, దీపావళి వరకు మన టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు. ఈ కారణం చేత ఈ వీకెండ్ ఈ చిత్రం భారీ రేంజ్ లో రీకవరీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కలెక్షన్స్ దీపావళి వరకు స్టడీ గా హోల్డ్ చేయగలిగితేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే కనీసం 20 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లే లాగా కనిపిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో అన్ని బాషల నుండి వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే 410 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రము లో సెలవు దినం కావడంతో ముందు రోజుకంటే ఒక ఆరు కోట్ల రూపాయిల గ్రాస్ ఎక్కువగా నమోదు అయ్యిందట. ఇక షేర్ లెక్కల్లోకి వస్తే నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిలు వచ్చినట్టు సమాచారం. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ మరియు నార్త్ ఇండియా తర్వాత ఈ సినిమాకు కేరళ రాష్ట్రం నుండి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 28 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆ ప్రాంతం నుండి నమోదు అయ్యినట్టు సమాచారం. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.