Kiran Abbavaram: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఈయన కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నాయి కానీ, అంతకు మించిన దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాప్స్ నుండి కోలుకొని ‘క’ సినిమాతో కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత విడుదలైన ‘దిల్ రూబ’ చిత్రంతో మరో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. దీంతో స్క్రిప్ట్స్ ఎంపిక పరంగా అనేక జాగ్రత్తలు తీసుకున్న ఆయన, ఇప్పుడు మన ముందుకు ‘k ర్యాంప్’ అనే చిత్రం ద్వారా రాబోతున్నాడు. టీజర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, దీపావళి కానుకగా అక్టోబర్ 18 న మన ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిన్న ఏర్పాటు చేశారు. కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి వీరాభిమాని అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయన విషయాన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. అదే విధంగా ‘k ర్యాంప్’ చిత్ర దర్శకుడు జైన్స్ నాని మహేష్ బాబు(Super Star Mahesh Babu) కి వీరాభిమాని. సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్ళ నుండి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా పవన్,మహేష్ ఫ్యాన్స్ ఎదురైతే రికార్డ్స్ విషయం లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే నిన్న కిరణ్ అబ్బవరం, జైన్స్ నాని మధ్య కూడా చిన్నపాటి ఫ్యాన్ వార్ జరిగింది. ఇది చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది, పవన్, మహేష్ ఫ్యాన్స్ కూడా దీనిని పాజిటివ్ గా తీసుకొని ఎంజాయ్ చేశారు.
ముందుగా ఒక రిపోర్టర్ డైరెక్టర్ ని ప్రశ్న అడుగుతూ మీరు చూస్తే మహేష్ బాబు అభిమాని, కిరణ్ అబ్బవరం పవన్ కళ్యాణ్ అభిమాని, మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా ఫ్యాన్ వార్స్ జరిగాయా అని అడగ్గా, దానికి డైరెక్టర్ నవ్వుతూ సమాధానం చెప్తూ ‘చాలా గొడవలు అయ్యాయి..కానీ ఇప్పుడు మేము కలిసి సినిమా చేసాము కాబట్టి, మా హీరో గొప్పే, ఆయన హీరో కూడా గొప్పే. నా ఫేవరెట్ హీరో థియేటర్ సుదర్శన్ 35MM లోనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది’ అని అంటాడు. అప్పుడు కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘సార్ మా హీరో థియేటర్ సంధ్య 35 MM లో వేయండి’ అని అంటాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ గొడవలు ఒద్దు, విశ్వనాధ్ థియేటర్ లో వేయండి’ అని అంటాడు కిరణ్ అబ్బవరం. అప్పుడు డైరెక్టర్ ‘అది కూడా మా థియేటర్ నే అన్నా’ అని అంటుంది. అలా సరదాగా వీళ్ళ మధ్య సాగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.
Ahaan nice ra ….
TL lo godava padinatlu balle cute undi fanwar#Kramp
— VA (@yourstrulyvinay) October 7, 2025