OG Movie Benefit Show Ticket Rates: సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలందరు మంచి సినిమాలను చేస్తున్న క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం గతంలో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి కేవలం తన అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తున్నాడు. అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేసి రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆనందాన్ని చూస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డు బ్రేక్ అవ్వబోతున్నాయంటూ తన అభిమానులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియరెన్స్ అయితే ఇచ్చింది. బెనిఫిట్ షో మొదటి రోజు 1 AM షో కి 1000 రూపాయల టికెట్ నైతే నిర్ణయించారు… మొత్తానికైతే ప్రతి ఒక్క అభిమాని 1000 రూపాయలు పెట్టి తన అభిమాన హీరో సినిమాని చూడడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా 24వ తేదీ నుంచి ఓజీ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ అయితే వెయ్యబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది. తద్వారా ఇతర హీరోలకు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో పోటీని ఇవ్వబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరొక వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సంవత్సరం ఇంతకుముందే ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలనే ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది…