OG Firestorm Song Raja Kumari: గత కొద్దిరోజుల క్రితమే విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం లోని ‘ఫైర్ స్ట్రోమ్'(Fire Strom) పాట ఎంత పెద్ద సెన్సేషనల్ చార్ట్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ పాటకు మెంటలెక్కిపోతున్నారు. ఆడియో సాంగ్ కంటే లిరికల్ వీడియో సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని చూసినట్టుగానే అనిపిస్తుంది, ఈమధ్య కాలంలో ఇంత హై రేంజ్ క్వాలిటీ తో ఒక లిరికల్ వీడియో సాంగ్ రావడం ఎప్పుడూ చూడలేదని, డైరెక్టర్ సుజిత్ విజన్ అద్భుతమని చూసిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ పాట ఇప్పటికీ టాప్ 1 స్థానం లో, అన్ని మ్యూజిక్ మాధ్యమాలలో ట్రెండ్ అవుతూ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ పాటలో ఒక మహిళ చాలా ఇంటెన్సిటీ తో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఆమె ఎవరో మీకు తెలుసా?.
Also Read: హీరో ధనుష్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
ఈ పాట మొత్తం ఒక ఎత్తు అయితే, అందులో ఈమె పెట్టిన ఎక్స్ ప్రెషన్స్ మరో ఎత్తు. సాంగ్ వేరే లెవెల్ కి వెళ్ళడానికి ఈమె కూడా ఒక కారణం. ఇంతకీ ఆమె ఎవరో చూద్దాం. ఈమె పేరు రాజకుమారి(Raja Kumari). ఈమె అమెరికా కి చెందిన ఒక పాపులర్ ర్యాప్ సింగర్. ఈమె సినిమాల కంటే ఎక్కువగా ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారానే ఫేమస్ అయ్యింది. యూత్ ఆడియన్స్ ఈమె పాటలకు మెంటలెక్కిపోతుంటారు. స్టేజి మీద ఎన్నో లైవ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చింది. ఈమె పని చేసిన సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’ చిత్రం లోని టైటిల్ సాంగ్ ట్రాక్ లో ఈమె కనిపిస్తుంది. అందులో ర్యాప్ బిట్ ఈమెనే పాడింది. ఆ టైటిల్ ట్రాక్ బాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసింది.
అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘బేబీ జాన్’, ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన ‘గేమ్ చేంజర్’ చిత్రాల్లో కూడా ఈమె పాటలు పాడింది. ‘గేమ్ చేంజర్’ చిత్రం లోని డోప్ హిందీ వెర్షన్ పాటను ఈమెనే పాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఒక్కో పాటకు ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ కూడా భారీ గానే ఉంటుందట. కానీ కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ మీద గౌరవం తో ఉచితంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైర్ స్ట్రోమ్ పాటలో ఈమె పెర్ఫార్మన్స్ ని చూసిన అభిమానులు, కచ్చితంగా ఆమెని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించాలని ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ ని ట్యాగ్ చేసి అభిమానులు కోరుకుంటున్నారు.
