OG Netflix: ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్(Netflix) లోకి అందుబాటులోకి వచ్చి ఓటీటీ రంగం లో కూడా రోజుకో రికార్డుని నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్టైల్, స్వాగ్ మరియు థమన్ మ్యూజిక్, డైరెక్టర్ సుజిత్ టేకింగ్ గురించి ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం సర్వ సాధారణం. కానీ ఇతర బాషల నుండి కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. విదేశీయులు కూడా ఈ చిత్రాన్ని చూసి అద్భుతం అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు.
Also Read: మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ…సెకండాఫ్ ఏంటి అలా ఉంది..?
ఇదంతా పక్కన పెడితే నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం గత నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలను, వెబ్ సిరీస్ లను కూడా వెనక్కి నెట్టి సెన్సేషన్ సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. తమిళియన్స్ అత్యధికంగా ఉండే శ్రీలంక, మలేషియా వంటి దేశాల్లో మాత్రమే కాకుండా, మలయాళీలు ఎక్కువగా ఉండే నార్త్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఊపు చూస్తుంటే ఈ సినిమా మొదటి నాలుగు వారాల్లోనే 4.5 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ గురువారం రోజున ఈ సినిమాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది రిపోర్ట్ వస్తుంది. ప్రస్తుతానికి ఇండియా లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రం గా హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రం నిల్చింది.
ఈ సినిమాకు మొదటి వారంలో 59 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ‘పుష్ప 2’ చిత్రానికి 56 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ రెండు రికార్డ్స్ ని ఓజీ చిత్రం బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు థియేటర్స్ లో ఈ చిత్రాన్ని చూడలేకపోయారు. అందుకే ఆ ఏజ్ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు నెట్ ఫ్లిక్స్ లోకి ఈ సినిమా రాగానే ఎగబడి మరీ చూస్తున్నారు. కచ్చితంగా ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది. హిందీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని విపరీతంగా చూస్తున్నారు. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతర్జాతీయ ఫుట్ బ్యాల్ వేదిక లో వాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.