OG 2 vs Salaar 2 craze: ఈమధ్య కాలం లో పాన్ ఇండియన్ సినిమా అంటూ వస్తున్నా ప్రతీ చిత్రానికి క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుంది అంటూ చిన్న క్లిఫ్ హ్యాంగర్ వదులుతున్నారు. కానీ ఈ సినిమాలకు సీక్వెల్ అవసరమా అసలు అనిపించేవి చాలానే ఉన్నాయి. కానీ సినిమా ముగింపు ఆడియన్స్ కి సంతృప్తి ఇవ్వడం కోసం ఇలా చేస్తుంటారు. అయితే ప్రస్తుతం విడుదలైన సినిమాల్లో యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో సలార్ 2(Salaar 2), ఓజీ 2(They Call Him OG ), కల్కి 2 చిత్రాలు కచ్చితంగా ఉంటాయి. ఈ మూడు సినిమాలకు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ముఖ్యంగా సలార్ 2, ఓజీ 2 చిత్రాలకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. సలార్ చిత్రానికి A సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ని చేరుకోలేకపోయింది.
ఓజీ పరిస్థితి కూడా అంతే. మల్టీప్లెక్స్ ఆధారిత సెంటర్స్ లో A సర్టిఫికేట్ కారణంగా ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. కానీ యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉండడం వల్ల ఓటీటీ లో విడుదలయ్యాక హిందీ ఆడియన్స్ కి బాగా చేరుతుందని, తద్వారా సీక్వెల్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి సీక్వెల్ ని హిందీ లో భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారట. నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కుదిరించుకున్న ఒప్పందం కారణంగా ఓజీ చిత్రాన్ని నార్త్ ఇండియా లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల చేయలేదు. ఇది ఈ సినిమాకు చాలా నష్టం చేసింది. సలార్ సినిమా విడుదల సమయం లో ఇలాంటి రూల్స్ లేవు కాబట్టి, ఆ చిత్రానికి భారీ వసూళ్లు నార్త్ ఇండియా లో వచ్చాయి.
అయితే సలార్ చిత్రానికి థియేటర్స్ లో కంటే ఎక్కువగా ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. జియో హాట్ స్టార్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ గత రెండేళ్ల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. అంతటి ఆదరణ దక్కించుకుంది అన్నమాట. ఇప్పుడు ఓజీ చిత్రానికి కూడా ఓటీటీ లో విడుదలయ్యాక అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని, సీక్వెల్ కి మంచి డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. యూత్ ఆడియన్స్ లో అత్యంత ఆదరణ దక్కించుకున్న ఈ రెండు సినిమాల సీక్వెల్స్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అనుకోవచ్చు. ఓజీ సీక్వెల్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సలార్ సీక్వెల్ కూడా వచ్చే ఏడాదిలోనే మొదలు అవుతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాయో చూడాలి.