Homeఆంధ్రప్రదేశ్‌Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత తెగ హడావిడి చేశారు. అంతేకాదు తన పార్టీ సొంత మీడియాలో అనేక రకాలుగా ప్రచారం చేసుకున్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన ప్రజా వేదికను కూల్చివేశారు. ఈ ప్రజా వేదికను కూల్చివేసే ప్రక్రియలో […]

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత తెగ హడావిడి చేశారు. అంతేకాదు తన పార్టీ సొంత మీడియాలో అనేక రకాలుగా ప్రచారం చేసుకున్నారు.

2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన ప్రజా వేదికను కూల్చివేశారు. ఈ ప్రజా వేదికను కూల్చివేసే ప్రక్రియలో ఆ వైసీపీ ఎమ్మెల్యే అద్భుతమైన పాత్ర పోషించారు. పైగా నాడు ఆయన కరకట్ట కమల్ హాసన్ అనే పేరు గడించారు. పొలాల్లో పనిచేయడం.. కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేయడం వంటి వాటిని వీడియోలలో రూపొందించి భారీగానే ప్రచారం చేసుకునేవారు. ఎప్పుడైతే ఆయనది ఇదంతా ప్రచారమేనని తెలియడంతో అప్పటినుంచి డౌన్ ట్రెండ్ మొదలైంది. ఆ తర్వాత ఆయన గురించి జనం పట్టించుకోవడం మానేశారు. పైగా వైసిపి కి ఆయన దూరంగా ఉండడం మొదలుపెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఊహించని ఫలితం వచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక నిశ్శబ్దంగా ఉండి పోయారు.

ఇప్పుడు మళ్లీ తన లెవెల్ యాక్టింగ్ మొదలుపెట్టారు.. ఒక షెడ్డు వేసుకొని.. దాని కింద ఊయల నిర్మించుకొని.. అందులో సేద తీరుతున్నారు. ఆ ప్రాంతం కూడా విజయవాడ కృష్ణా నది కరకట్టకు దగ్గర్లో ఉండడం విశేషం. గతంలో కరకట్ట గురించి ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడారు. ఎన్నో వీడియోలు చేశారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ దూరం పెట్టింది. ఆయన కూడా దూరం జరిగారు. చివరికి ఇలా మిగిలిపోయారు.

రాజకీయాలలో వ్యూహాలు ఉండాలి. ప్రణాళికలు కూడా ఉండాలి.. ప్రత్యర్థిని అధిగమించే సాహసం కూడా చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు నైతికతను పాటించాలి. ఇవి ఆ ఎమ్మెల్యే పాటించలేదు. పైగా నాడు జగన్ అండ చూసుకొని రెచ్చిపోయారు. వీర లెవెల్ లో యాక్టింగ్ చేశారు. అసలు పేరుకు బదులుగా కరకట్ట కమలహాసన్ అనే బిరుదును సంపాదించుకున్నారు. చివరికి ఆ బిరుదు కూడా ఆయనకు లాభం చేకూర్చలేకపోతోంది. దీనినే అంటారు స్వయంకృతరాపరాధమని..

నాడు ఆ ఎమ్మెల్యే ఎంత ఓవర్ యాక్షన్ చేసినప్పటికీ.. కూటమి ప్రభుత్వ నేతలు ఆయన మీద రివెంజ్ తీర్చుకోవడం లేదు. కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. ఆయన అంటూ ఒక నేత ఉన్నాడని కూడా గుర్తించడం లేదు. పైగా కూటమినేతలు గతంలో ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రాజకీయాలు అంటే వ్యక్తిగత కక్షలు కావని నిరూపిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper