HomeతెలంగాణRevanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం ఉన్నారు. ఆ గ్రామాన్ని మొత్తం చూసి భావోద్వేగానికి గురయ్యారు. పూరిగుడిసెలు ఉన్న గ్రామంలో పక్కా గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కెసిఆర్ చెప్పినట్టుగా ఆ గ్రామం రూపురేఖలు మారిపోలేదు. పేదలకు పక్కా గృహాల నిర్మాణం సాధ్యం కాలేదు. కెసిఆర్ మాట నమ్మి ఉన్న ఇండ్లను కూల్చుకున్నారు. నాడు కెసిఆర్ 100 కోట్లు ఇస్తామంటే అక్కడి ప్రజలు పూర్తిగా నమ్మారు. పైగా కేసీఆర్ తమతో పాటు కలిసి భోజనం చేస్తే గ్రామస్తులు మురిసిపోయారు.

నాడు వాసాల మర్రి ప్రాంతంలో కేసీఆర్ కాన్వాయ్ రావడానికి నిర్మించిన తాత్కాలిక రోడ్డు తప్ప.. చెప్పుకునే స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. భవనాలు నిర్మించలేదు. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కెసిఆర్ చేసిన చారిత్రక తప్పును దిద్దడం మొదలుపెట్టారు. వాసాల మర్రి ప్రాంతంలో పేదలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ గ్రామానికి ఏకంగా 143 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. ఫలితంగా గ్రామస్తులు యుద్ధ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించుకుంటున్నారు. లబ్ధిదారులకు నగదు సాయాన్ని వేగంగా అందించడం మొదలుపెట్టారు.

నాడు కెసిఆర్ వాసాల మర్రి ప్రాంతంలో చేసిన ప్రకటనలను
.. ఇచ్చిన హామీలను పదేపదే ప్రజలకు గుర్తుచేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే త్వరలో ఆయన వాసాల మర్రి ప్రాంతంలో పర్యటించబోతున్నారు.. పూర్తిచేసిన పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు కాలంలో చేపట్టబోయే పనులను ప్రారంభించబోతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. కాగా గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా సాగిపోయాయి. రోడ్లు.. ఇతర మౌలిక వసతులను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఫలితంగా వాసాలమర్రి బంగారు మర్రిగా రూపుదిద్దుకుంటున్నది.

ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రచారం కోసం గ్రామాలను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి రేవంత్ వాసాల మర్రి ప్రాంతంలో పర్యటించబోతున్నారు. నాడు కెసిఆర్ కోరుకున్న ప్రచారాన్ని.. ఈ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు రేవంత్. మరి దీనిని గులాబీ బాస్ కేసీఆర్ తిప్పి కొడతారో చూడాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వాసాలమర్రిలో జరుగుతున్నపనులను జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper