Odela 2 Movie Teaser
Odela 2 Movie Teaser: అందం తో పాటు యాక్టింగ్, డ్యాన్స్ వచ్చిన అతి తక్కువమంది సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా(Tamanna Bhatia). ఈమె నటించిన సినిమాలన్నీ ఒకసారి పరిశీలిస్తే, ఎదో హీరో పక్కన నాలుగు స్టెప్పులేసి, రెండు ముద్దు సన్నివేశాల్లో నటించి వెళ్లే హీరోయిన్ లాగా అసలు అనిపించదు. ప్రతీ చిత్రంలోనూ ఆమె తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది. అదే విధంగా ఈ జనరేషన్ లో విలన్ రోల్స్ కి అంగీకారం తెలిపిన మొట్టమొదటి హీరోయిన్ కూడా ఈమెనే. ఈమె మొదటి తమిళ చిత్ర ‘కేడి’ లో నెగటివ్ రోల్ చేసింది. ఆ తర్వాత తెలుగు లో నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ చిత్రంలో కూడా నెగటివ్ రోల్ లో మెరిసింది. అదే విధంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఈమె హిట్స్ ని అందుకుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఓదెల 2′(Odela2 Teaser).
సంపత్ నంది దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే వెబ్ చిత్రం ఆహా మీడియా యాప్ లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించింది. ఆమెకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘ఓదెల 2’ తెరకెక్కింది. కానీ ఇది మొదటి భాగం లాగా వెబ్ ఫిలిం కాదు, థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే కుంభమేళా లో విడుదల చేసింది మూవీ టీం. ఈ టీజర్ లో తమన్నా ని చూసిన తర్వాత లేడీ అఖండ లాగా అనిపించింది. ఇప్పటి వరకు ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి క్యారక్టర్ లో చూడడం ఎప్పుడూ జరగలేదు. కేవలం మగవాళ్ళు మాత్రమే ఇలాంటి క్యారెక్టర్స్ చేసారు.
ఈ టీజర్ లో తమన్నా చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. టీజర్ కొత్తగా ఏమి అనిపించలేదు. మంచికి,చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం లాగానే అనిపించింది. కానీ విజువల్స్ మాత్రం గ్రాండ్ గా అనిపించింది. గతంలో సంపత్ నంది తమన్నా తో రచ్చ చిత్రం చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. కమర్షియల్ సినిమాలు చేసుకునే సంపత్ నంది లో ఇలాంటి సినిమాలు తీసే టాలెంట్ కూడా ఉందా అని ఈ టీజర్ ని చూసిన తర్వాతే తెలిసింది. ఈ చిత్రం లో మొదటి భాగం లో ఉన్నటువంటి హెబ్బా పటేల్ కూడా ఉన్నట్టు ఈ టీజర్ లో చూసిన కొన్ని షాట్స్ తర్వాత అర్థమైంది. ఓవరాల్ గా కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమాలాగే అనిపిస్తుంది. కానీ సమ్మర్ లో పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటి మధ్య ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.