Bapu Movie Review: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి. చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాపు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మల్లన్న అనే ఒక వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇక తను చాలా మంది దగ్గర అప్పురూపంలో డబ్బులను తీసుకుంటాడు. వాళ్ళందరూ కలిసి అతన్ని ఊరి పెద్ద దగ్గరికి పిలూస్తారు. దాంతో వారం రోజుల్లోపు తన అప్పు మొత్తాన్ని తీర్చాలని ఊరు పెద్ద చెబుతాడు. మరి తను ఆ వారం రోజుల్లో అప్పు తీర్చాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని ఎంటర్టైనర్ గా మార్చిన డైరెక్టర్ మొదటి నుంచి చివరి వరకు సినిమాలో ఉన్న ఎమోషన్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లాడు. ఇక దాంతో పాటుగా ఆయన ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పెషల్ ఐడెంటిటిని ఇవ్వడమే కాకుండా మల్లన్న ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ ను దర్శకుడు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయితే సాధించాడు. అందుకే ప్రతి ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడు.
కోర్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల సినిమా సీన్స్ కొంచెం అక్కడక్కడ డల్ అయినట్టుగా అనిపించినప్పటికి ఓవరాల్ గా సినిమాలను మాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ప్రయత్నమైతే చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఆ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో డార్క్ కామెడీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు మనం తెలుగులో చాలా తక్కువగా చూశాం.. కాబట్టి ఈ సినిమా చాలా మందికి నచ్చుతుంది… ఇక ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ప్లస్ అయింది. అక్కడక్కడ సినిమాని హైప్ చేస్తూ కొన్నిచోట్లలో డౌన్ చేస్తు ఆ టెంపో ను దర్శకుడు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే బ్రహ్మాజీ ఈ సినిమాలో ఒక సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఆ పాత్రకి తను ఎంతలా నటించాలో ఆ మేరకు మాత్రమే నటించి ఆ పాత్ర యొక్క ఐడెంటిటిని కాపాడటమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి పాత్రలో బ్రహ్మాజీ ఇప్పటివరకు నటించలేదు కాబట్టి ఈ పాత్ర ఆయనకి బాగా సెట్ అయిందనే చెప్పాలి…
ఇక సుధాకర్ రెడ్డి కేతిరి చేసిన క్యారెక్టర్ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయింది. ముఖ్యంగా సినిమా మొత్తం అతని మీదనే ట్రావెల్ అవుతూ ఉండడం వల్ల ఆయన ఇందులో నటించిన విధానంగానే, కనిపించిన తీరుగాని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది… ఆమని తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు. అలాగే అవసరాల శ్రీనివాస్ సైతం తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నమైతే చేశారు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో ఎక్కడ కూడా ఆ విలేజ్ ఫ్లేవర్ పోకుండా సినిమాటోగ్రాఫర్ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమాకి విజువల్స్ ని అందించాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో చాలా బాగా సెట్ అయ్యాయనే చెప్పాలి…
ప్లస్ పాయింట్స్
డైరెక్షన్
సెకండాఫ్ ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
కొన్ని అనవసరపు సీన్స్
డార్క్ కామెడీ
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5
