Rajamouli Angry: సినీ అభిమానులు సెలబ్రిటీలను ఆకాశం నుండి దిగి వచ్చిన తారలు లాగా ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. వాళ్ళు కనిపించినప్పుడు బుర్ర పని చేయదు, మనసుకి ఏది తోచితే ఆ పని చేస్తుంటాము. నిన్న అదే జరిగింది. రాజమౌళి(SS Rajamouli) కి పట్టరాని కోపం వచ్చేలా చేసింది ఒక అభిమాని ప్రవర్తన. వివరాల్లోకి వెళ్తే నిన్న మన టాలీవుడ్ దిగ్గజ నటుడు, లెజెండ్ కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మృతి చెందడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. సినీ ప్రముఖులు కొంతమంది సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేస్తే, మరి కొంతమంది మాత్రం నేరుగా వెళ్లి విచారం వ్యక్తం చేసి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించారు. వారిలో రాజమౌళి, ఆయన సతీమణి కూడా ఉన్నారు. లోపల కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని సందర్శించుకొని బయటకు వస్తున్న సమయం లో రాజమౌళి అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు.
Also Read: హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అభిమానులకు చేదువార్త..డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన!
ఒకసారి రాజమౌళి అతన్ని తప్పించుకొని వెళ్ళాడు. కానీ మళ్ళీ అతను రాజమౌళి ని సెల్ఫీ కోసం వెంబడించాడు. దీంతో చిరాకు పడిన రాజమౌళి ‘ఏంటి బ్రో నువ్వు..అసలు బుద్దుందా నీకు..ఎక్కడికి వచ్చి ఏమి చేస్తున్నావ్’ అంటూ మండిపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రాజమౌళి విషయం లో మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ విషయం లో కూడా ఇదే రిపీట్ అయ్యింది. నిన్న రాత్రి ఆయన కోట శ్రీనివాస రావు గారి ఇంటికి వచ్చి నివాళి అర్పించాడు. అనంతరం మీడియా తో మాట్లాడి తిరిగి వెళ్తుండగా ఆయనతో పాటు వచ్చిన అభిమానులు ‘జై ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. దీనిని ఎన్టీఆర్ ఆపుతూ ‘జై కోట శ్రీనివాస రావు’ అని నినదించాడు. ఇలాంటివి ఎన్నో నిన్న ఒక్క రోజునే జరిగాయి.
అభిమానులు సినీ తారలను దేవుళ్ళు లాగా చూడడం ఇప్పటికైనా మానుకోవాలి. వాళ్ళు కూడా మన లాగానే సాధారణమైన మనుషులు. వాళ్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. వాటిని గౌరవించాలి. ఒక మహానటుడు చనిపోయాడు అనే బాధలో ఉన్నప్పుడు అతని వద్దకు వెళ్లి సెల్ఫీ అడిగితే ఎంత చిరాకుగా ఉంటుంది మీరే ఆలోచించండి?, ఇలాంటి పరిస్థితి మీకు వచ్చి, మీ వద్దకు ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే మీరు నవ్వుతూ సెల్ఫీ ఇస్తారా చెప్పండి?, మామూలు సందర్భాల్లో ఇలాంటివి జరిగితే పర్వాలేదు అనుకోవచ్చు,కానీ ఒక మహానటుడు చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇలాంటివి చేయడం మనిషి లక్షణం అనిపించుకోదు. దయచేసి సెలెబ్రెటీలను చూసినప్పుడు మీ ఎమోషన్స్ ని కాస్త కంట్రోల్ చేసుకోండి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఆ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మిస్ చేయకండి.
View this post on Instagram