https://oktelugu.com/

NTR and Koratala Siva : కొరటాల శివ ని తప్పించుకొని తిరుగుతున్న ఎన్టీఆర్..సమయం వృధా చేసుకోకు అంటూ వార్నింగ్!

#RRR , దేవర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో 'వార్ 2' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Written By: , Updated On : January 30, 2025 / 02:02 PM IST
NTR , Koratala Siva

NTR , Koratala Siva

Follow us on

NTR and Koratala Siva : #RRR , దేవర వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హ్రితిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ లో ‘వార్ 2’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ కొరటాల శివ ఇది వరకే తెలిపాడు. సినిమా క్లైమాక్స్ లో క్లిఫ్ హ్యాంగర్ గా ‘దేవర’ ని కొడుకు ‘వర’ ఎందుకు చంపాడు అనే అంశాన్ని చూపిస్తూ, పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది అదే అని ప్రేక్షకులు పెదవి విరిచారు.

బాహుబలి క్లిఫ్ హ్యాంగర్ సీన్ కి స్పూఫ్ చేసినట్టుగా ఉందని, కొత్తగా ఏమి లేదని విమర్శలు వచ్చాయి. ‘దేవర’ తోనే ఆపేస్తే బాగుంటుందని, ఈ చిత్రానికి పార్ట్ 2 అవసరం లేదని అభిమానుల అభిప్రాయం కూడా. ఎందుకంటే ‘దేవర’ చిత్రం కంటెంట్ వల్ల ఆడలేదు, కేవలం ఎన్టీఆర్ స్టామినా మీద నడిచిన చిత్రమిది. సినిమా చాలా రొటీన్ గానే ఉంటుంది. ఇది కాదు అనలేని నిజం. అనిరుద్ అందించిన అద్భుతమైన సంగీతం, ఎన్టీఆర్ నటన ఈ చిత్రాన్ని నిలబెట్టింది. లేకపోతే మరో ఆచార్య అయ్యేది అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా కొరటాల శివ దేవర కి సీక్వెల్ చేయాలనీ తెగ కష్టపడుతున్నాడు. ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి డేట్స్ అడిగే ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్ ఇతను వస్తున్నాడనే విషయం తెలుసుకొని అతనికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

రీసెంట్ గా ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ సెట్స్ కి వెళ్ళాడు. ఎన్టీఆర్ ఆరోజు ఇంకా షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టలేదు. కానీ కొరటాల శివ అతనికంటే ముందుగా వచ్చి, మాట్లాడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎన్టీఆర్ రాగానే దేవర సీక్వెల్ కి సంబంధించి చర్చలు చేయగా, ఇది వర్కౌట్ అవ్వదు, నా వెనుక తిరిగి సమయం వృధా చేసుకోకు, వేరే ప్రాజెక్ట్స్ చూసుకో అని చెప్పాడట. దీంతో కొరటాల నిరుత్సాహంతోనే వెనుతిరిగినట్టు తెలుస్తుంది. ‘దేవర’ చిత్రం తర్వాత ఇతని కెరీర్ ఊపందుకుంటుంది అనుకుంటే, స్టార్ హీరోలు అసలు కొరటాల శివ ని పట్టించుకోవడమే మానేశారు. రీసెంట్ గానే ఆయన అల్లు అర్జున్ ని కలిసి ఒక కథని వినిపించాడట. అల్లు అర్జున్ కి స్టోరీ లైన్ బాగా నచ్చింది, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రండి, నచ్చితే సినిమా చేద్దామని అన్నాడట. మరి అల్లు అర్జున్ తో ఆయన సినిమా ఖరారు చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.