Diva Jaimin Shah
Diva Jaimin Shah: ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో గౌతమ్ అదా నీ (Gautam Adani) కుటుంబం పాల్గొన్నది. పుణ్య స్నానాలు చేసింది. ఈ సందర్భంలో గౌతమ్ ఆదానికి కాబోయే చిన్న కోడలు ఎవరో తెలిసిపోయింది. ఆమె పేరు దివా జైమిన్ షా.. ఫిబ్రవరి 7న గౌతమ్ అదాని చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా జైమిన్ షా వివాహం జరగనుంది.. సంప్రదాయ రీతిలో ఈ వివాహం జరిపిస్తామని.. గౌతమ్ అదానీ ఇప్పటికే ప్రకటించారు. గౌతమ్ అదానికి కాబోయే చిన్న కోడలు కావడంతో దివా జైమిన్ షా గురించి నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతున్నది. దివా జైమిన్ షా ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రయాగ్ రాజ్ లో ఆమె మహా కుంభమేళాలో పాల్గొన్నారు. గౌతమ్ అదాని కుటుంబంతో కలిసి పుణ్ స్నానం చేశారు.
ఈమె నేపథ్యం ఏంటంటే..
దివా జైమిన్ షా తండ్రి పేరు జైమిన్ షా.. ఈయన పేరుపొందిన వజ్రాల వ్యాపారి.. సూరత్, ముంబై ప్రాంతాలలో ” సి దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్” అనే కంపెనీకి సహ యజమానిగా ఉన్నాడు.. వజ్రాల వ్యాపారంలో జైమిన్ షా కుటుంబానికి విశేషమైన అనుభవం ఉంది. పైగా వివిధ ఆకృతులలో వీరు వజ్రాలు తయారు చేస్తారు. అందువల్లే వజ్రాల తయారీలో తమకంటూ ఒక ప్రత్యేకతను రూపొందించుకున్నారు. అయితే తండ్రి జైమిన్ షా నేతృత్వంలో.. జిగర్ దోషి, అమిత్ దోషి, యోమేష్ షా వంటి వారి ఆధ్వర్యంలో దివా జైమిన్ షా వజ్రాల వ్యాపారాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. నెదర్లాండ్, హాంకాంగ్ దేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే వేలకోట్ల వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ దివా జైమిన్ షా సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండరు. ఆమెకు ఫైనాన్స్, ఇతర వ్యాపారాలలో విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే గౌతమ్ అదాని కుటుంబం దివా జైమిన్ షా తమ కుటుంబ సభ్యురాలిగా చేర్చుకోవడానికి ఇష్టాన్ని ప్రదర్శించింది.
ఇద్దరూ ధనిక కుటుంబాల వారే..
దివా జైమిన్ షా, జీత్ అదానీ కుటుంబాలు ధనిక వర్గానికి చెందినవే. అయితే వీరి వివాహం కూడా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి స్థాయిలో జరుగుతుందని అందరూ అనుకున్నారు. దేశ విదేశాలనుంచి ప్రముఖులు వస్తారని భావించారు. కానీ పెళ్లి మాత్రం అత్యంత సాధారణంగా నిర్వహిస్తామని గౌతమ్ ఆదాన్ని ఇప్పటికే ప్రకటించారు.. 2023 మార్చి 14న జీత్, దివా నిశ్చితార్థం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉదయపూర్ ప్రాంతంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరుపుకున్నారు.. ఆ కార్యక్రమాన్ని కూడా గౌతం ఆదాని కుటుంబం అత్యంత సాధారణంగా నిర్వహించింది.. ఇక ప్రస్తుతం జీత్ ప్రధాని గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. దాని విమానాశ్రయాలు, అదాని డిజిటల్ ల్యాబ్స్ వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు.