https://oktelugu.com/

NTR: మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ వేసిన ఎన్టీఆర్..పండగ చేసుకుంటున్న అభిమానులు!

పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ గురించి ఎన్నో సందర్భాలలో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆయన డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది చాలా తక్కువ. ఇది పవన్ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసిన విషయం. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలవగానే ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 21, 2024 / 02:27 PM IST

    NTR(5)

    Follow us on

    NTR: టాలీవుడ్ లో విపరీతమైన మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్లిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి మిగతా హీరోలకు అసూయ వేయక తప్పదు. అలాంటి ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు కలిస్తే చూడాలని కోట్లాది మంది అభిమానులకు కోరికగా ఉంటుంది. ‘అరవింద సమేత’ మూవీ ఓపెనింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాగే అంతకు ముందు రామ్ చరణ్ నిశ్చితార్ధ వేడుకలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

    ఇలా ఈ ఇద్దరు హీరోలు కలిసిన ప్రతీ సందర్భం ఒక సెన్సేషన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ గురించి ఎన్నో సందర్భాలలో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆయన డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది చాలా తక్కువ. ఇది పవన్ అభిమానులకు కాస్త నిరాశకు గురి చేసిన విషయం. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలవగానే ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక ట్వీట్ వేసాడు. అందుకు అభిమానులు కాస్త సంతృప్తి పడ్డారు. ఇక నేడు దేవర చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్, అదనపు షోస్ అడగగానే ఇచ్చినందుకు ఆ చిత్రం యూనిట్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలిచేస్తూ ట్వీట్ వేసాడు. ఆయన మాట్లాడుతూ ‘మా దేవర చిత్రానికి అన్ని విధాలుగా సహకరిస్తూ, టికెట్ రేట్స్, అదనపు షోస్ కి అనుమతిని ఇచ్చినందుకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు. తెలుగు సినిమాకి మీరు చేస్తున్న సేవలు అద్భుతం. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి కూడా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా ట్వీట్ వేసాడు.

    మరో వారం రోజుల్లో దేవర చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో అర్థ రాత్రి 12 గంటల షోస్ నుండి మొదలు కానుంది. టికెట్ రేట్స్ రెండు వారాల పాటు సింగల్ స్క్రీన్స్ కి 110 రూపాయిలు, మల్టీప్లెక్స్ కి 135 రూపాయిలు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి ఈ స్థాయి టికెట్ రేట్స్ పెడితే ఆకాశమే హద్దు అనే విధంగా ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి. గత 5 ఏళ్ళ జగన్ ప్రభుత్వం లో సినీ పరిశ్రమ బాగా పడిపోయింది. కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో ఒకప్పుడు తెలుగు సినిమా ఎలా ఉండేదో, ఇప్పుడు అలా ఉన్నందుకు ఆనందంగా ఉందంటూ సినీ విశ్లేషకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.