Site icon OkTelugu

Flipkart Big Bilian Days Sale 2024: ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో మోటొరోలా ప్రభంజనం సృష్టించనుందా.. ఇంకా ఎన్నో డీల్స్..

Flipkart Big Bilian Days Sale 2024

Flipkart Big Bilian Days Sale 2024

Flipkart Big Bilian Days Sale 2024: దసరా సీజన్ వచ్చిందంటే అందరికీ పండుగే. కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అవుతాయి. కానీ దసరా లాంటి పండుగ పెద్ద పండగుగా దేశం మొత్తం ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ పండగకు బట్టల షాపుల నుంచి ప్రతీ షాపు కస్టమర్లతో నిండిపోయి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ పెరిగింది. కాబట్టి ఆన్ లైన్ స్టోర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటివి కూడా ఆఫర్లతో సందడి చేస్తాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ (Flipcart) బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 పేరుతో ఆఫర్లను ప్రకటించింది. అయితే.. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024కు ముందు మోటొరోలా తన పాపులర్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో, మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 నియో, మోటో జీ85 5జీ, మోటో జీ64 5 జీ ల్లో కొత్త కలర్ వేరియంట్లను పండుగ సేల్ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ మోటొరొలా ఉత్పత్తులు సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభ యాక్సెస్ కస్టమర్ల కోసం, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా సెప్టెంబర్ 27 నుంచి వినియోగదారులందరికీ అమ్మకానికి వస్తాయి. ముఖ్యంగా మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో, ఫ్యూజన్ సేల్ ధర వద్ద ప్రీ బుక్ చేసుకోవచ్చు. 2024, సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో కూడా రీడీమ్ చేసుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కోసం అందించే బిగ్ బిలియన్ డేస్ సేల్ డీల్ తో ప్రారంభమైన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ రోమ్ వేరియంట్) కేవలం రూ. 35,999 వద్ద కేవలం రూ. 27,999 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి) నికర ధరతో కొనుగోలు చేయవచ్చు.

మోటొరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 19,999. ఇందులో బెస్ట్ సోనీ లైటియా ఎల్‌వైటీ-700సీ కెమెరా, ఆల్ పిక్సెల్ ఇన్ స్టంట్ ఫోకస్ టెక్నాలజీతో కూడిన 50 మెగా పిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4కే వీడియో రికార్డింగ్ ఉన్నాయి. డిస్కౌంట్ తో అమ్మకానికి ఉన్న మరో మోటొరోలా స్మార్ట్ ఫోన్ మోటొరోలా ఎడ్జ్ 50 నియో. బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్ల తర్వాత ఇది నాలుగు పాంటోన్ రంగుల్లో రూ. 22,999కి వాల్యూ ఫెస్టివల్ సేల్ కింద లభిస్తుంది.

మోటొరోలా జీ సిరీస్ డివైస్ ల విషయానికి వస్తే.. మోటొరోలా తన మోటో జీ 85 5జీలో కొత్త వైవా మెజెంటా కలర్ వేరియంట్ అందిస్తోంది. 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ – సోనీ లైటియా 600 కెమెరాతో కూడిన ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ రోమ్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ రోమ్ వరుసగా రూ. 15,999, రూ. 17,999 ధరలకు లభిస్తుంది.

మోటో జీ64 5జీ కొత్త బెర్రీ రెడ్ కలర్ లో రూ. 15,000 సెగ్మెంట్ లో రూ. 13,999 ధరకు లభిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్, 2.5 గిగాహెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీలను అందిస్తుంది. మొటొరోలాకు సంబంధించి ఈ వేరియంట్ల కోసం బిగ్ బిలియన్ డేస్ లో సెర్చ్ చేయాలని ఫ్లిప్ కార్టు సూచిస్తోంది.

 

Exit mobile version