Prabhas Raja Saab: మారుతి (Maruthi) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా మీద ప్రేక్షకులకి మంచి అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ని చూసిన ప్రేక్షకులందరు చాలా బాగుందని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నప్పటికి ఆ టీజర్ కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రముఖి, ‘ప్రేమ కథ చిత్రమ్’ లాంటి సినిమాలను చూసినట్టుగానే అనిపిస్తుందని ప్రభాస్ లాంటి హీరో చేయాల్సిన సినిమా అది కాదని కమర్షియల్ ఎంటర్ టైనర్ దగ్గరికి అంతకంటే బాగుంటుంది అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలన్నీ భారీ స్కేల్లో వస్తున్నప్పటికి రాజాసాబ్ (Rajaasaab) సినిమా మాత్రం హార్రర్ తో కూడిన త్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు. ఈ సినిమాతో మారుతి ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు. తద్వారా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదుగుతాడా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రాజాసాబ్ సినిమా ద్వారా సక్సెస్ వస్తే పర్లేదు కానీ ఫెయిల్యూర్ వస్తే మాత్రం మారుతి కెరీర్ అనేది భారీగా డ్యామేజ్ అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికి ప్రభాస్ క్రేజే ఈ సినిమాకి మైనస్ గా మారబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇది ప్రభాస్ లాంటి స్టార్ హీరో చేయాల్సిన సినిమా అయితే కాదు.
Also Read: అత్యంత దయనీయమైన పరిస్థితి లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. స్పందించిన జాకీ భగ్నానీ!
కానీ ఈ సినిమా మీదనే ప్రొడ్యూసర్లు దర్శకుడు మంచి ఆశాలైతే పెట్టుకున్నారు. ఇక తొందర్లోనే ఈ సినిమాని కంప్లీట్ చేసి డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ లాంటి నటుడు చేయబోతున్న సినిమాలన్నీ బిగ్ ప్రాజెక్ట్ లే కావడం వల్ల వాటి ముందు ఈ సినిమా పెద్దగా ఆనడం లేదు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మాత్రం ప్రేక్షకులో అంచనాలు విపరీతంగా ఉంటాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా ఉండబోతుంది. మరి ఈ సినిమాలన్నింటితో ఆయన క్రేజ్ తారస్థాయిలోకి వెళ్ళిపోయి ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…