https://oktelugu.com/

Junior NTR : ఏకంగా 35 రోజులు నీటిలోపలే జీవనం..’దేవర’ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు చెప్పిన ఎన్టీఆర్!

'ఒక స్టూడియో లో అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఒక పెద్ద వాటర్ పూల్ ని సిద్ధం చేసారు. ఈ వాటర్ పూల్ ని దాదాపుగా 200 వాటర్ ట్యాంకర్లతో నింపారు. నిజమైన సముద్రం అనిపించడానికి అంత పెద్ద సెట్టింగ్ చెయ్యాల్సి వచ్చింది. ప్రతీ రోజు వాటర్ లోనే సన్నివేశాలు చేసేవాళ్ళం. అలా 35 రోజులు నీటిలోనే సన్నివేశాలను చేశాను.

Written By:
  • Vicky
  • , Updated On : September 15, 2024 / 08:35 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR : #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ సుమారు రెండేళ్ల పాటు కొరటాల శివ కి డేట్స్ కేటాయించి ‘దేవర’ చిత్రాన్ని పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ ని తీసిన కొరటాల శివ ని నమ్మి వెంటనే అవకాశం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఏ హీరో కూడా అంతటి సాహసం చేయడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ చేసాడు. కొరటాల శివ తన మీద ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోడానికి ప్రతీ క్షణం ఎంతో కష్టపడ్డాడు, సినిమా మీద రెండేళ్లు ఆయన ఒక తపస్సు లాగ భావించి తన సమయాన్ని కేటాయించాడు. దాని ఫలితమే ఈరోజు దేవర చిత్రం మీద ఏర్పడిన ఈ హైప్. విడుదలకు 12 రోజుల ముందే, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లకు పైగా రాబట్టింది అంటే సాధారణమైన విషయం కాదు. కల్కి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా ఈ స్థాయి బుకింగ్స్ జారహాలేదు.

    ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ మరియు సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో దేవర చిత్రం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ముఖ్యంగా ఈ సినిమాలో సముద్రంలో వచ్చే పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒక స్టూడియో లో అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఒక పెద్ద వాటర్ పూల్ ని సిద్ధం చేసారు. ఈ వాటర్ పూల్ ని దాదాపుగా 200 వాటర్ ట్యాంకర్లతో నింపారు. నిజమైన సముద్రం అనిపించడానికి అంత పెద్ద సెట్టింగ్ చెయ్యాల్సి వచ్చింది. ప్రతీ రోజు వాటర్ లోనే సన్నివేశాలు చేసేవాళ్ళం. అలా 35 రోజులు నీటిలోనే సన్నివేశాలను చేశాను. నా కళ్ళు కొన్ని రోజులు అందువల్ల పనిచేయలేదు. సరిగా కనపడేది కాదు. అయినప్పటికీ అలాగే షూటింగ్ చేశాను. ఒక్క 15 నిమిషాల సన్నివేశం కోసం ఒక రోజు మొత్తం నీటిలో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

    అలాగే ముంబై లో పని చేయడం పై తన అనుభూతిని పంచుకున్నాడు ఎన్టీఆర్. ముంబై తనకు కొత్త కాబట్టి ఇక్కడ టెక్నీషియన్స్ ఎలా పని చేస్తారో, మనతో ఎలా ప్రవర్తిస్తారో అనే భయం ఉండేది అట. అయితే #RRR మూవీ ప్రొమోషన్స్ కి రాజమౌళి తో కలిసి వచ్చినప్పుడు అక్కడి వాతావరణం మొత్తం అలవాటు పడిందట. ముంబై టెక్నీషియన్స్ తో పని చేయడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకి రానుంది.