NTR Ram Charan Relationship: ఎన్టీఆర్ , రామ్ చరణ్ మధ్య స్నేహ పూర్వ వాతావరణం #RRR చిత్రం నుండి మాత్రమే కాదు , అంతకు ముందు నుండే ఉంది. వీళ్లిద్దరి కలిసి పార్టీలకు , పబ్బులకు వెళ్లడం వంటివి గతం లో చాలానే చేశారు. అదే విధంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్, రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ విచ్చేసి సంబరాలు చేసుకునేవారు. ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్ #RRR మూవీ ఇంటర్వ్యూ సమయం లో చెప్పుకొచ్చాడు. మార్చి 26 న ప్రణతి పుట్టినరోజు అని , మార్చి 27 అర్థ రాత్రి 12 గంటలకు నేను మా ఇంటి గేట్ బయట నిలబడడం , చరణ్ కారు రావడం, అతని పుట్టినరోజు వేడుకలకు వెళ్లడం జరిగేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇది చూసినప్పుడు అభిమానులం మనం ఈ రేంజ్ కొట్లాడుకుంటున్నాము , కానీ హీరోలు ఎంత స్నేహం గా ఉన్నారో చూడండి అంటూ సోషల్ మీడియా లో మాట్లాడుకున్నారు ఫ్యాన్స్.
#RRR తర్వాత కూడా వీళ్ళ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే వచ్చింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , వీళ్లిద్దరి మధ్య ఈసారి సాన్నిహిత్య సంబంధాలు తెగిపోయాయేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గడిచిన రెండు సంవత్సరాల నుండి వీళ్లిద్దరు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడం లేదు. గతం లో ఇలా ఉండేది కాదు , ప్రతీ పుట్టిన రోజుకి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఒకరిని ఒకరు పట్టించుకోవడం లేదు. మహేష్ బాబు , అల్లు అర్జున్ వంటి వారికి ఎన్టీఆర్ ప్రతీ ఏడాది మర్చిపోకుండా శుభాకాంక్షలు తెలుపుతాడు. అల్లు అర్జున్ ని ఆయన ప్రేమగా బావ అని పిలుస్తాడు , అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ ని బామ్మర్దిగానే ట్రీట్ చేస్తాడు.
నేడు కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపాడు , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కానీ రామ్ చరణ్ నుండి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు రాలేదు , ఇక్కడే అభిమానులకు అనుమానాలు రావడం మొదలయ్యాయి , వీళ్లిద్దరి మధ్య ఏదైనా ఈగో క్లాష్ జరిగిందా?, అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు , సోషల్ మీడియా లో ఎలాగో వీళ్ళు శుభాకాంక్షలు చెప్పుకోవడం లేదు , కనీసం వ్యక్తిగతంగా అయినా చెప్పుకుంటున్నారా?, అన్నదమ్ములు లాగా కలిసి ఉండే ఈ ఇద్దరు మాస్ హీరోలు ఇలా ఉండడాన్ని అభిమానులు అసలు తీసుకోలేకపోతున్నారు.
