NTR Prashanth Neel Movie Budget: నందమూరి నటవారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)…ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడంతో వరుసగా ఏడు విజయాలను సాధించిన స్టార్ హీరోగా తను ఒక గొప్ప గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈ జనరేషన్ లో ఉన్న హీరోలెవరు వరుసగా ఏడు విజయాలను అయితే సాధించలేదు. ఆ ఘనతను సాధించిన ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలవడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే ఎనిమిదో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్న వాడు అవుతాడు…ఇక దాంతోపాటుగా ప్రశాంత్ నీల్ (Peashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల వరకు బడ్జెట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట 600 కోట్లు బడ్జెట్ తో స్టార్ట్ చేసిన ఈ సినిమా రోజురోజుకీ బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉండడంతో ఎన్టీఆర్ పైన ఈ రేంజ్ లో బడ్జెట్ పెడితే రికవరీ అవుతుందా? అనే ధోరణిలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన దేవర (Devara) సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
Also Read: అత్యంత దయనీయమైన పరిస్థితి లో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. స్పందించిన జాకీ భగ్నానీ!
మరి 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అంటే మూవీకి దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్లు వచ్చినప్పుడే ఈ సినిమా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటారు. ఇక ప్రశాంత నీల్ మీద నమ్మకంతోనే ఇలాంటి ఒక భారీ సినిమాకి సన్నాహాలైతే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ ను ఇస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక తన తోటి హీరోలందరు 1000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు సాగుతుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టే దగ్గరే ఆగిపోయాడు. మరి ఈ సినిమాతోనే ఆయన 1000 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టి తన తోటి హీరోలతో పాటు పోటీల్లో తను కూడా ఉన్నానని నిరూపించుకుంటాడా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా తనకు భారీ సక్సెస్ ని కట్టబెట్టి ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాసే విధంగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తోంది అంటూ ఒక భారీ కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు…