NTR And Prashanth Neel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. వారి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అమితమైన ఇష్టాన్ని చూపించడమే కాకుండా ఆ సినిమాని సక్సెస్ చేసేంతవరకు వాళ్లు నిద్రపోరు… ఇక ఇలాంటి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మన తెలుగు హీరోలు భారీ రేంజ్ లో సినిమాలను చేసి మంచి సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే మొదటి స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే తెలుగు స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరియర్ మొదటి నుంచి ఎన్నో మంచి సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేయడమే కాకుండా రీసెంట్ గా ఈ సినిమాకి సంభందించిన ముహూర్తపు కార్యక్రమాలను కూడా జరిపారు. ఇక ఎప్పటి నుంచో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్న క్రమంలో ఎట్టకేలకు ఈ సినిమాకు స్టార్ట్ అయితే చేశారు. అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నడట. దానికోసమే ఎన్టీఆర్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించి మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అవి ఏ పాత్రలు అంటే ఒకటి భీకరమైన రాజు పాత్ర గా తెలుస్తుంది. ఇందులో నియంత పాత్రలో నటించబోతున్నట్లు గా తెలుస్తోంది. మరొకటి మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా నటిస్తున్నాడట, ఇక ఇంకో క్యారెక్టర్ ఏంటి అనేది సస్పెన్స్ లో ఉంచుతున్నారు. ఇక మొత్తానికైతే మూడు గెటప్పుల్లో ఈసారి మనం ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇంతకుముందు ఆయన ‘జై లవకుశ’ సినిమాలో కూడా మూడు పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆ సినిమాను కూడా సూపర్ సక్సెస్ గా నిలిపాడు…
ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ మీదనే భారీ అంచనాలు పెట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది… సలార్ సినిమాతో ప్రభాస్ కి సూపర్ హిట్ ను అందించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కూడా ఆ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…