Mr Bachchan: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సోలో గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చిన వాళ్లలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక్కడే ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన మరొక హీరో రవితేజ…ఎవరు ఏమనుకున్నా ఈయన చిరంజీవి తర్వాత స్థానంలో నిలుస్తాడు. రవితేజ మొదట చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ సరైన గుర్తింపు రావడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇక ఎట్టకేలకు ఆయన కష్టానికి ప్రతి ఫలం అయితే దక్కింది. దాంతో మంచి సినిమాలను చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో టాప్ హీరోలందరికీ తను పోటీగా మారాడు అంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక మొత్తానికైతే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడేలా చేసుకున్నాడు. అలాంటి స్టార్ హీరో కొన్ని రోజుల నుంచి వరుస ప్లాపులను ఇస్తున్నారు. ఇక ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో మరోసారి తన లక్కు ను పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ఒక సినిమా కోసం 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా దర్శకుడు అయిన హరీష్ శంకర్ మాత్రం ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ మరికొన్ని వార్తలు వైరల్ గా మారాయి.
దీన్నిబట్టి చూస్తే రవితేజ కంటే హరీష్ శంకర్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి హరీష్ శంకర్ కి అంత మార్కెట్ ఉందా అంటే ఒక రకంగా లేదనే చెప్పాలి. కానీ ఆయన పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వల్ల ఆయన మార్కెట్ అనేది భారీగా పెరిగింది. అందువల్లే ఈ సినిమా కోసం హరీష్ శంకర్ కి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుతున్నట్టుగా తెలుస్తుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ అయిన టీజీ విశ్వప్రసాద్ హరీష్ శంకర్ కి భారీ లెవెల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఈ సినిమాని చేయించుకుంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా రవితేజ లాంటి స్టార్ హీరో కంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ ఎక్కువ రెమ్యూననరేషన్ తీసుకోవడం అనేది తన టాలెంట్ ని కూడా జనాలకు తెలిసేలా చేస్తుంది.
నిజానికి హరీష్ శంకర్ కెరియర్లో మిరపకాయ్, గబ్బర్ సింగ్, గద్దల కొండ గణేష్ లాంటి మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో తన ఉన్నట్టుగా తెలుస్తుంది…