https://oktelugu.com/

Gen AI : అసలేంటి Gen AI.. మహిళల వృద్ధికి బ్రహ్మాస్త్రంలా ఎలా పని చేస్తుంది.?

మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మేం దేనిలో తక్కువ కాదంటూ సత్తా చాటుతున్నారు. రంగమేదైనా మేం వెనక్కి తగ్గబోమని నిరూపిస్తున్నారు. వ్యాపార, రక్షణ, సేవా రంగాల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాణిస్తున్నారు. ఇక సాఫ్ట్ వేర్, బ్యాంకింగ్ రంగాల్లోనూ కీలక స్థానాలకు మహిళలు ఎదిగారు. అయితే మహిళల ఎదుగుదలకు దోహద పడేలా ఇప్పుడు జెన్ ఏఐ సిద్ధమవుతన్నది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2024 / 02:44 PM IST

    How Gen AI can act as a panacea for the advancement of women.?

    Follow us on

    Gen AI :  సరిలేరు మాకెవ్వరూ అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. నేల, నింగి, నీరు ఎక్కడైనా వెనక్కి తగ్గేది లేదంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇక రాజకీయ రంగంలోనూ సత్తా చాటిన వారెందరో ఉన్నారు. రక్షణ రంగంలో ముఖ్యంగా వైమానిక రంగంలో జెట్ ఫ్లైట్లలో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు. అంతరిక్షానికి దూసుకెళ్లి చరిత్రను తిరగరాసిన మహిళలు కూడా ఉన్నారు. రంగమేదైనా మేం విజయాలు సాధిస్తామంటూ ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అయితే టెకీ రంగంలో చూసుకేంటే మాత్రం కీలక స్థాయిలో మహిళల సంఖ్య చెప్పుకునేంతగా లేకపోవడం బాధాకరం. ఇక ఇప్పుడు చూసుకుంటే ఇండియా టెక్ వర్క్ ఫోర్స్ లో సుమారు 36 శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం. అయితే టీం లీడర్లుగా, నాయకత్వం వహించే వారి సంఖ్య మాత్రం అందుకు అనుగుణంగా లేదని ఓ నివేదిక తెలిపింది. టీం లీడర్లుగా, ప్రముఖ పాత్ర పోషించే వారి సంఖ్య చూసుకుంటే కేవలం 4 నుంచి 8 శాతంగా మాత్రే నమోదవుతున్నది. ఈ సంఖ్య కొంతకాలంగా ఇలాగే కొనసాగుతన్నది. దీనిలో వృద్ధి కనిపించడం లేదు. ఇక ఈ సంఖ్యను మెరుగుపరిచేందుకు దోహదపడేలా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) సిద్ధమవుతున్నది. 2.27 నాటికి ప్రపంచ ఏఐ మార్కెట్ 320 నుంచి 380 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ వృద్ధి 25 నుంచి 35 శాతానికి పెరుగుతుందన్నమాట. అయితే ఇందులో జెన్ ఏ ఐ 33 శాతం ఆక్రమిస్తుందని తెలుస్తున్నది.

    జెన్ ఏఐ ద్వారా..
    ఇక రానున్న రోజుల్లో టెకీ రంగంలో మహిళల ఎదుగుదలకు ఈ జెన్ ఏఐ దోహదం చేస్తుంది. అన్ని వ్యవస్థల వృద్ధి, కీలకమైన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకెళ్లేందుకు ఈ జెన్ ఏఐ మహిళలకు ఉంతో ఉపయోగపడనుంది. తద్వారా మహిళల వృద్ధి రేటు ఈ రంగంలో గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశ టెక్నాలజీ రంగానికి వైవిధ్యత అవసరం. విభిన్న నైతికతను కలుపుకోవడం, పక్షపాతాలను తొలగించడం తదితర వ్యవస్థలను ఈ వ్యవస్థ నిర్ధారిస్తుంది. టెకీ రంగంలో లింగ అసమానతను సరిచేయడానికి, మహిళలకు మరిన్ని అవకాశాలను ఇవ్వడానికి ఇది దోహదం చేస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎండీ శ్రీషా జార్జ్ తెలిపారు.

    అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందే..
    ఇక నాస్కామ్ సీనియర్ ఉపాధ్యక్షురాలు, చీప్ స్ర్టాటజీ అధికారి సంగీతా గుప్తా కూడా దీనిపై స్పందించారు. ఇక టెకీ రంగంలో జెన్ ఏఐ అధిపత్యం చెలాయించడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే రానున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలి. టెక్నాలజీని సాధ్యమైనంత మేరకు సద్వినియోగం చేసుకోవాలి. విజయాలు నమోదు చేయాలంటే ఇది చాలా అవసరం. దీని ద్వారా మనం ఎంచుకున్న రంగంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందే అవకాశం ఉంటుంది. జెన్ ఏఐ ద్వారా ఈ రంగంలో మహిళలు కీలక స్థానాల్లో పనిచేసే వీలు కలుగుతుంది. ఆయా బృందాలకు నాయకత్వం వహించే అవకాశాలు దక్కే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు.