NTR and Prashanth Neel : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనను తాను స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను కూడా తనే మోస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండటం విశేషం…నందమూరి తారక రామారావు (Nandamuri tharaka ramarao) గారి మనవడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ మూడోవ తరం నందమూరి ఫ్యామిలీ లెగసీని కూడా తనే ముందుకు తీసుకెళుతున్నాడు…ఇక గత సంవత్సరం దేవర (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీలో (ఆర్ ఎఫ్ సి) లో భారీ ఎత్తున ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్యాక్ డ్రాప్ ని కనక మనం తెలుసుకున్నట్లైతే ఇది సముద్రపు బ్యాక్ డ్రాప్ ని ఆసరాగా చేసుకొని ఒక కథను రెడీ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ని సముద్ర తీరాల్లో చూపించబోతున్నాడు. నిజానికి దేవర సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సముద్రపు అంచున నివసించే వ్యక్తి గా చూపించాడు.
Also Read : ఎన్టీయార్, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ సెట్ లోకి అడుగుపెట్టేది అప్పుడేనా..?
ఈ సముద్రం కోపగిస్తే దానిని ఎర్ర సముద్రంగా మార్చే ఒక బీభత్సమైన ప్రళయాన్ని సృష్టించే పాత్రలో నటించాడు. మరి ఇప్పుడు సైతం మళ్లీ సముద్రపు స్టోరీ నే ఎంచుకోవడం పట్ల చాలా మంది సినిమా మేధావులు సైతం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఎప్పుడు ఇలాంటి స్టోరీలను ఎంచుకుంటున్నారు అంటూ కొంతవరకు వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ స్థాయిలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తన తోటి హీరోలందరూ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుంటే ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో కేవలం 500 కోట్ల మార్కును మాత్రమే టచ్ చేశాడు.
కాబట్టి తనను తాను మరోసారి ఈ సినిమాతో భారీగా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక దేవర సముద్రపు స్టోరీనే ఆ మూవీ మంచి విజయాన్ని సాదించిందని మళ్ళీ ఆయన అలాంటి బ్యాక్ డ్రాప్ నే ఏంచుకున్నాడా అనే విమర్శలు కూడా వస్తున్నాయి…
Also Read : 2000 మందితో భారీ ఫైట్..ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఫోటో చూస్తే మెంటలెక్కిపోతారు!