RK Roja: కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రోజాపై( RK Roja) ఫోకస్ పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లలో ఆమె ఒకరు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె నోటికి అని చెప్పేవారు. అడ్డగోలుగా మాట్లాడేవారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేవారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై కేసు నమోదు చేయడం కాకుండా.. అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె హయాంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: ఏపీలో నియోజకవర్గాల పెంపు.. కీలక ప్రతిపాదనలతో ఢిల్లీకి చంద్రబాబు!
* ‘ఆడుదాం ఆంధ్రా’లో అవినీతి
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) ప్రభుత్వ హయాంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆడుదాం ఆంధ్ర పేరిట పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడా పోటీల నిర్వహణలో దాదాపు 199 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే రోజా విషయంలో ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. అత్యున్నత అధికారులతో కూడిన ఒక బృందాన్ని విచారణకు నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో రోజా సైతం టార్గెట్ అయినట్లు అవుతోంది. ఆమెతో పాటు మాజీ మంత్రి, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మాన కృష్ణ దాస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
* వరుస అరెస్టులతో..
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vallabha neni Vamsi Mohan ) అరెస్టయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి సైతం అరెస్టయ్యారు. రిమాండ్ ఖైదీగా మారారు. ఆయనపై కేసుల మీద కేసులు వేస్తూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రభుత్వం తీరు చూస్తుంటే మాజీమంత్రి రోజాపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో మరో మూడు నెలల్లో ఆమె అరెస్టు ఖాయమని తెలుస్తోంది.
* కొద్దిరోజులుగా ప్రభుత్వం పై విమర్శలు
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రోజా. అయితే తరువాత జగన్మోహన్ రెడ్డి ఆమెకు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అప్పటినుంచి ఆమె వాయిస్ వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే మాజీ మంత్రులు రోజా, కృష్ణ దాసులను ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రోజా అవినీతిని బయటపెడతామని మంత్రి ప్రకటించడం విశేషం.
Also Read: వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు.. రంగన్న ఆకస్మిక మృతి!