NTR And Prashanth Neel: కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్(Junior Ntr), ప్రశాంత్ నీల్(Prasanth Neel) మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు గ్రాండ్ గా మొదలైంది. మొదటి రోజే 2000 మందితో భారీ పోరాట సన్నివేశాన్ని షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా లో మూవీ టీం విడుదల చేయగా, ఆ ట్వీట్ కి ఎన్టీఆర్ క్వాట్ చేస్తూ ‘అండ్ ఇట్ బిగిన్స్’ అంటూ ట్వీట్ వేసాడు. దీనికి నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రీట్వీట్స్, లైక్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సాధారణ డైరెక్టర్స్ తోనే దేవర లాంటి సంచలనాత్మక రికార్డ్స్ క్రియేట్ చేసే సత్తా ఉన్నటువంటి ఎన్టీఆర్ కి, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోడైతే బాక్స్ ఆఫీస్ విద్వంసం ఊహించడానికి మన తరం అవుతుందా?.
తెలుగు లో ఎలాగో ఎన్టీఆర్ కి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సరైన టాక్ వస్తే కనీసం 600 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుంది. అదే విధంగా ప్రశాంత్ నీల్ కి హిందీ, కన్నడ, తమిళం భాషల్లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి కేవలం ప్రాంతాలు మొత్తం కలిపి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంటే మినిమం లోకి మినిమం 1600 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా మేకర్స్ చేతిలో ఉందన్నమాట. సినిమాలో కేజీఎఫ్ తరహాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి క్యూ కడుతారు. వాళ్ళు థియేటర్స్ కి రావడం మొదలు పెడితే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో మనమంతా కళ్లారా ఎన్నో ఉదాహరణలు చూసాము. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం మరో ఉదాహరణ కాబోతుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ బుక్స్ లో సరికొత్త చరిత్ర లిఖించబోతుంది.
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2′(War2 Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. హ్రితిక్ రోషన్(Hritik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ వల్లే, ఇన్ని రోజులు నీల్ తో చేయాల్సిన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వార్ 2 షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కి డేట్స్ కేటాయించాడు. నేడు మొదలైన షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఆయన లేని సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్ కూడా షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ ఖరారు అయ్యింది. ఇక మిగిలిన తారాగణం గురించి అప్డేట్ ఉగాది లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.