Homeఎంటర్టైన్మెంట్NTR New Movie: బాలయ్య బాబు చేయలేని పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్...

NTR New Movie: బాలయ్య బాబు చేయలేని పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్…

NTR New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు స్టార్ హీరోలు చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాలయ్య బాబు లాంటి నటుడు ఇంతకు ముందు వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. కానీ బోయపాటి డైరెక్షన్లో చేసిన […]

NTR New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవ్వరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు స్టార్ హీరోలు చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాలయ్య బాబు లాంటి నటుడు ఇంతకు ముందు వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేశాడు. కానీ బోయపాటి డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో బాలయ్య సైతం తన మార్కెట్ ను కోల్పోయాడు. ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే తన మార్కెట్ ఎంత? ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండాలంటే ఒక సినిమా మీద ఎన్ని కోట్ల వరకు బడ్జెట్ పెట్టచ్చు అనే ఒక బౌండరీస్ అయితే తెలుసుకున్నాడు. అందువల్లే ఇప్పుడు గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా బడ్జెట్ చాలా వరకు తగ్గించి మరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటే చాలు అనే కోణంలో బాలయ్య బాబు సైతం ఆలోచిస్తున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోవతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నందమూరు ఫ్యామిలీ హీరోలందరి కి ప్రత్యేకమైన ప్రాముఖ్య ఉంది. బాలయ్య బాబు తన ఎంటైర్ కెరియర్ లో డిఫరెంట్ పాత్రలను చేశాడు.

కానీ ఎన్టీఆర్ ఇప్పటివరకు అంత వైవిధ్యభరితమైన పాత్రలను పోషించలేదు. ఇప్పటి వరకు బాలయ్య బాబు చేయనటువంటి ఒక క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఆయన క సైకో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయన సంజయ్ లీలా భన్సాలీ జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక కథను వినిపించాడు.

ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయిన ఆ స్టోరీలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉందట. ఇక ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని ఒక సైకో మాదిరిగా ఉండే పాత్రని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. అతను ఎందుకు సైకోగా మారాడు అనేదే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది. మొత్తానికైతే సంజయ్ లీలా భన్సాలీ చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది మరి ఈ సినిమా తను చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper