spot_img
Homeఅంతర్జాతీయంmiddle east war impact : ట్రంప్ ను లేపేయి అన్నాడు.. అందరూ అదోలా చూశారు.....

middle east war impact : ట్రంప్ ను లేపేయి అన్నాడు.. అందరూ అదోలా చూశారు.. ఇది శానా పెద్ద కథ సామి

middle east war impact : అమెరికాలో ధరలు పెరుగుతున్నాయి. మధ్య ఆసియాలో యుద్ధం జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రపంచానికి ఏమాత్రం మంచిని ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మొత్తానికి చమురు సరఫరా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు చమురు మీరు ఆధారపడిన అన్ని వ్యవస్థలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

ప్రపంచం బాధ.. పాత్రికేయుల బాధ ఒకటే. ఎందుకంటే ప్రపంచం లో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని.. అందరికీ చేరవేయడం పాత్రికేయుల బాధ్యత. ఒక్కోసారి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు పాత్రికేయులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తుంటాయి. అలాంటప్పుడు పాత్రికేయులు తామ మనుషులమే అనే విషయాన్ని గుర్తించి.. మనుషుల్లాగానే ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తన ఒక్కోసారి సభ్య సమాజాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాకపోతే అంతిమంగా జరిగేది సమాజ శ్రేయస్సు మాత్రమే.

ఓ పాత్రికేయుడికి యుద్ధం వల్ల ఎదురైన అనుభవాన్ని.. ఆ వార్తల తాలూకు ప్రభావాన్ని ఈ కథనంలో చెప్పుకుందాం. కాకపోతే అది ఈ యదార్థ జీవితానికి యధావిధిగా ఉంటుంది.. పాఠకులు సవినయంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

ఆ సీనియర్ పాత్రికేయుడు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆఫీస్ కి వెళ్లే క్రమంలో దాహంగా ఉంటే కొబ్బరి బోండాల వ్యాపారి దగ్గర తన బండి ఆపాడు. పండు చెట్టు చాలామంది ఉన్నారు. ఆ కొబ్బరి బోండాల వ్యక్తి కత్తితో కొబ్బరి బొండాలను నరుకుతూనే ఉన్నాడు.. ఆ పాత్రికేయుడు ఆ బోండం నరికే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తనకు మంచిగా నీళ్లు ఉండే బోండాన్ని నరకమని చెప్పాడు.. అలా అతడు స్పెసిఫిక్ సూచనలు ఇవ్వడంతో.. పక్కనున్నవారు రాకాస డైరెక్టర్ లాగా మొహమట పడుతున్నాడు వీడెవడు రా అన్నట్టుగా చూశారు. అతని మాటలు విన్న మిగతా వారంతా.. స్కామ్ లో ఇరుక్కున్న మంగ్లీ మాదిరిగా చేశారు..

ఈలోపు ఆ పాత్రికేయుడికి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కాల్ కూడా వచ్చింది.. ఏముంది ఇజ్రాయిల్ అధిపతి నెతన్యాహూ ను లేపేసేయ్ అన్నాడు. పక్కనున్న పెద్ద వ్యక్తి కొబ్బరి బోండా తాగి ఆపేసి అతని వైపు చూశాడు. ఆ పాత్రికేయుడు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు.. వాన్ని కూడా లేపేసేయ్ అన్నాడు. కొబ్బరి బోండాల వ్యక్తి నరకడం ఆపేసి.. ఆ పాత్రికేయుడి వైపు అదోలా చూశాడు. అంతేకాదు పక్కనున్న వాళ్లకు ఇవ్వాల్సిన కొబ్బరి బొండాన్ని ఆ పాత్రికేయుడికి ఇచ్చాడు. ఆ పాత్రికేయుడు మహాభాగ్యం అనుకుంటూ ఆ కొబ్బరి బోండాన్ని చేతిలోకి తీసుకొని తాగేశాడు..

“ట్రంప్ మీద దయ చూపించు. ఖమెని ని పక్కన పెట్టు. పుతిన్.. జిన్ పింగ్ ను బతికిపోయారు” అంటూ ఆ ఫోన్లో ఆ పాత్రికేయుడు చెప్పాడు.. పక్కనే ఉన్న కొబ్బరి బొండం తాగడం ఆపేశాడు.. “భయ్యా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ట్రంప్ ను పక్కన పెట్టడం కాదు.. అసలు ఈ దరిద్రాలకు మొత్తం కారణం వాడే. వాన్ని ఏసేయాల్సింది” అని అన్నాడు. దానికి ఆ పాత్రికేయుడు చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత కాల్ కట్ చేశాడు..

అనంతరం ఆ పాత్రికేయుడు దగ్గరికి ఓ ముసలి వ్యక్తి వచ్చాడు.. “బాబు నువ్వు దురంధర్ సినిమాలో రన్ వీర్ సింగ్ మాదిరిగా ఉన్నావ్.. కొంపతీసి నువ్వు అండర్ కవర్ ఆఫీసర్ వా..” అన్నాడు. దానికి ఆ పాత్రికేయుడు “ఎందుకు సార్ అలా అంటున్నారు” అని ఆ పెద్దమనిషితో అన్నాడు.. “ఏం లేదు నువ్వు ట్రంప్ ను లేపేసేయ్ అంటున్నావ్. అందర్నీ పక్కన పెట్టు అంటున్నావ్.. నువ్వు గూడచారి సినిమాలో సీక్రెట్ ఏజెంట్ పాత్రధారి మాదిరిగా ఉన్నావ్. నీ మాటలు అలానే ఉన్నాయి. అందుకే అనుమానం వచ్చి ఇలా అంటున్నాను” అని ఆ పెద్దమనిషి అన్నాడు.

” సార్ గూడచారి సినిమాలో హీరోని కాదు. స్పై ఏజెంట్ ను అంతకంటే కాదు. ఒక మామూలు యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వ్యక్తిని. తంబ్ నెయిల్స్ కోసం వాళ్లకు ఫోన్లో ఏదో చెప్తున్నాను. కొందరిని ఉంచండి.. ఇంకా కొంత మందిని తీసేయండి అంటున్నాను” అని ఆ పాత్రికేయుడు చెప్పాడు చెప్పాడు. దీంతో ఆ పెద్దమనిషి నిరాశతో వెళ్లిపోయాడు.. మిగతావారు కూడా అయ్యో అన్నట్టుగా చేశారు. కొబ్బరి బోండాలు కొట్టే వ్యక్తి మాత్రం మరింత కసి తో కనిపించాడు. ఎందుకంటే అతడి ఇడ్లీ బండి వ్యాపారం ఆగిపోయింది. బతుకు చక్రాన్ని లాగించాలని కొబ్బరి బోండాల వ్యాపారిగా మారిపోయాడు.. ఇడ్లీ బండిమీద రోజుకు 3000 వచ్చేవట. ఇప్పుడు వెయ్యి రూపాయలు రావడం కష్టమైపోతుందట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper