Homeఎంటర్టైన్మెంట్RRR: ఆర్​ఆర్​ఆర్​ మూడో సాంగ్​ వచ్చేది అప్పడే!

RRR: ఆర్​ఆర్​ఆర్​ మూడో సాంగ్​ వచ్చేది అప్పడే!

RRR: ప్రస్తుతం పాన్​ ఇండియా సినిమాలు సాధారణం అయ్యాయి. టాలీవుడ్​, బాలీవుడ్​ అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా పాన్​ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మల్టీస్టారర్​గా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా కలిసి నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ వచ్చినప్పటి నుంచి.. వరుసగా ప్రమోషన్స్​లో భాగంగా ప్రోమోలు, వీడియోలు విడుదల చేస్తోంది చిత్రబృందం.

ఇటీవల నాటు నాటు పేరుతో తారక్​, చెర్రి కలిసి స్టెప్పులేసే లిరికల్​ సాంగ్​ను విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 15 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్నాయి. మాస్​ స్టెప్పులతో ఈ హీరోలిద్దరు  ఇరగదీశారు. థియేటర్లో మాత్రం ఈ పాటకు పూనకాలే అని అర్థమవుతోంది. కాగా, ప్రస్తుత మరో అప్​డేట్​ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

RRR: Naatu Naatu Song (TELUGU) NTR, Ram Charan | M M Keeravaani | SS Rajamouli | Telugu Songs 2021

ఈ సినిమా మూడో పాటను నవంబరు 18న విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి వచ్చింది. ఇప్పటికే కీరవాణి అందించిన రెండు పాటలు భారీ విజయం సాధించాయి. మరి మూడో సాంగ్ ఏ థీమ్​కు చెందిందో చూడాలి. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version