Gopichand: హీరో గోపీచంద్ నుంచి భారీ హిట్ వచ్చి చాలా కాలమైంది. ఈ మధ్య వచ్చిన సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ విషయంలో వెనకపడ్డాయి. ఆ మధ్య వచ్చిన లౌక్యం ఒక్కటే హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డీసెంట్ రివ్యూలు వచ్చినా కానీ.. కలెక్షన్స్ రాలేదు. గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ కూడా ‘లో’గా ఉండడం మూలాన ఓపెనింగ్స్ కూడా బాగా తగ్గాయి.

పైగా గోపీచంద్ ప్లాప్ నుంచి బయటపడలేదు. దీంతో ఇప్పుడు రాబోతున్న పక్కా కమర్షియల్ పై పూర్తి ప్రెషర్ పడుతోంది. ఈ సినిమా బడ్జెట్ చేయిదాటిపోయింది. బడ్జెట్ ను తగ్గించాలని నిర్మాతలు భావించినా సాధ్యం కాలేదు. గోపీచంద్ దగ్గర ఉండి, భారీగా ఖర్చు పెట్టించారు. తనకు హిట్ కావాలని.. కాబట్టి, కాంప్రమైజ్ కాకూడదు అని గోపీచంద్ కాస్త భారీగానే ఖర్చు పెట్టించాడు.
Also Read: Hemachandra- Sravana Bhargavi: విడాకులపై సంచలన ప్రకటన చేసిన సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి
దీనికితోడు గోపీచంద్ ఈ చిత్రం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. పక్కా కమర్షియల్ చిత్రానికి తాను తీసుకున్న పారితోషికం తగ్గించుకుని దాని బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. దీని వల్ల నిర్మాతకు సౌలభ్యంగా ఉంటుందని గోపీచంద్ భావన. కానీ, గోపీచంద్ సినిమాకు లాభాలు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది.
దీనికితోడు పక్కా కమర్షియల్ సినిమాకి ఓవర్ బడ్జెట్ అయ్యింది. పెట్టిన పెట్టుబడి వస్తేనే గగనం అనుకుంటున్న క్రమంలో.. ఇక పక్కా కమర్షియల్ తో ఇక గోపీచంద్ కి ఇక లాభలు ఏమి వస్తాయి ?, మొత్తానికి గోపీచంద్ కి ఈ సినిమా పెద్దగా ఆర్ధికంగా ఎలాంటి లాభదాయకం కాదు అని అర్థం అయిపోతుంది.
కాకపోతే, హీరో గోపీచంద్ కి ఎలాగైనా హిట్ సినిమా ఇవ్వాలనే కసితో తన క్రియేటివిటీని అంతా గుమ్మరిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. కాగా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తమ కలయికలో వస్తున్న “పక్కా కమర్షియల్ ” సినిమా పై మొత్తానికి ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాడు. మరి ఈ సినిమా జులై 1వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి.
ఇక గోపిచంద్ సరసన హీరోయిన్ గా రాశీఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డమరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,
Also Read:Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్
[…] […]