ఎన్టీఆర్ జ‌యంతిః మెగాస్టార్‌, తార‌క్ స్పెష‌ల్ ట్వీట్స్‌

తెలుగు సినీ వినీలాకాశంలో ధృవ‌తార‌గా వెలుగొందిన వారిలో నంద‌మూరి తార‌క రామారావు ఒక‌రు. అయితే.. న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఇవాళ ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్భంగా.. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే.. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కోరారు. ‘‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్నఇచ్చినట్టు.. […]

Written By: Bhaskar, Updated On : May 28, 2021 4:23 pm
Follow us on


తెలుగు సినీ వినీలాకాశంలో ధృవ‌తార‌గా వెలుగొందిన వారిలో నంద‌మూరి తార‌క రామారావు ఒక‌రు. అయితే.. న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు. ఇవాళ ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్భంగా.. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే.. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఆయ‌న‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కోరారు. ‘‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్నఇచ్చినట్టు.. మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుగారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌర‌వం ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం. ఆ మ‌హానుభావుడి 98వ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా వారిని స్మ‌రించుకుంటూ’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇక‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న తాత‌ను త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను’. అని జూనియర్ ట్వీట్ చేశాడు.

వీరిద్దరే కాకుండా.. పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయ‌న్ను స్మ‌రించుకుంటున్నారు. ఇది ఎన్టీఆర్ 98వ జ‌యంతి. ఈ స్పెష‌ల్ డేను పుర‌స్క‌రించుకొని అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో సంబ‌రాలు చేసుకుంటున్నారు.