https://oktelugu.com/

Devara Review : దేవర పరిస్థితి ఏంటి..? ఆ వర్గం ప్రేక్షకులను ఎందుకు అలరించలేకపోతుంది…

ఒక రెండు మూడు రోజుల ఆగితే తప్ప ఒరిజినల్ టాక్ ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే లేదు...మరి మొత్తానికైతే ఈ సినిమా కొంతమందికి నచ్చితే మరి కొంత మందికి నచ్చడం లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : September 27, 2024 / 07:38 AM IST

    Devara Review

    Follow us on

    Devara Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇప్పటివరకు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఈ సినిమా మీద మొదటి నుంచి ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీయార్ చేస్తున్న సినిమాలు వరుస విజయాలను సాధించడమే కాకుండా తనను తాను పాన్ ఇండియా లో మరొకసారి స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఎన్టీయార్ లాంటి స్టార్ హీరోలు దేవర సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధించారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ముఖ్యంగా కొన్ని వర్గాల ప్రేక్షకులను అలరించినప్పటికి మరికొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం అంత బాగా సంతృప్తి అయితే చేయలేకపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏ సెంటర్ ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిందనే విషయంలో కొన్ని కామెంట్లైతే వస్తున్నాయి…

    ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే ‘మ్యాన్ ఆఫ్ ది మాసేస్’ అనే మంచి పేరు అయితే ఉంది. మరి అలాంటి హీరో చేస్తున్న సినిమాలో సోల్ అయితే మిస్ అయిందంటూ చాలా కామెంట్లైతే చేస్తున్నారు. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ సినిమాను చాలా ప్రెస్టేజీయస్ తీసుకొని చేశాడు. అలాగే కొరటాల శివ కూడా ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకొని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే.

    మరి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇది వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా రిలీజై మంచి విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎలా సూపర్ సక్సెస్ అయిందో అంతటి రేంజ్ ను మాత్రం ఈ సినిమా అందుకోలేకపోవచ్చని కొంతమంది సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను అందుకోవాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ కల ఫుల్ ఫ్రిడ్జ్డ్ గా నెరవేరిందా? లేదా అనేది తెలియాలంటే నఈ సినిమా కలెక్షన్స్ ని బట్టి, ఒక రెండు మూడు రోజుల ఆగితే తప్ప ఒరిజినల్ టాక్ ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే లేదు…

    మరి మొత్తానికైతే ఈ సినిమా కొంతమందికి నచ్చితే మరి కొంత మందికి నచ్చడం లేదు… లాంగ్ రన్ లో ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది…